---Advertisement---

వివేకానంద రెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు… మళ్లీ మినీ ట్రయల్‌కు బ్రేక్?

February 5, 2026

Summarize with AI

---Advertisement---

వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసు (Murder Case)పై సుప్రీంకోర్టు (Supreme Court)లో మరోసారి కీలక విచారణ జరిగింది. ఈ కేసులో ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత రెడ్డి (Sunitha Reddy) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిశీలించింది. సీబీఐ(CBI) తరఫున న్యాయవాది కోర్టుకు వివరణ ఇస్తూ, ఇప్పటికే ప్రధాన దర్యాప్తు పూర్తయ్యిందని, ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నామని తెలిపారు.

విచారణ సందర్భంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేస్తూ, ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇలా కొనసాగితే విచారణకు సంవత్సరాల కాలం పట్టే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని, అయితే ఎవరిని విచారించాలన్న అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోదని స్పష్టంగా తెలిపారు.

ఇంతకుముందు జరిగిన విచారణలో కూడా సీబీఐ దర్యాప్తు సాగుతున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు నిరంతరం కొనసాగితే పదేళ్లు పట్టే పరిస్థితి వస్తుందా అంటూ న్యాయమూర్తులు నాడే ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సునీత రెడ్డి పిటిషన్‌పై తమ వైఖరి తెలియజేయాలని సీబీఐను నాడు ఆదేశించగా, కొంత సమయం కోరిన సీబీఐ అభ్యర్థన మేరకు విచారణను నేటికి వాయిదా వేశారు.

అయితే తాజాగా జరిగిన విచారణలోనూ సుప్రీంకోర్టు తన వైఖరిని స్పష్టం చేస్తూ, ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారమే సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని, దర్యాప్తు పరిధి లేదా విచారణకు పిలవాల్సిన వ్యక్తులపై తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment