---Advertisement---

పవన్ నోట తిరుమల రెండు కొండల మాట – అసత్య ప్రచారానికి అంతేలేదా?

February 5, 2026

---Advertisement---

తిరుమల (Tirumala) లడ్డు ప్రసాదంలో (Laddu Prasadam) ఆవు కోవ్వు , పంది కోవ్వు , చేప నూనే అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నానా హంగామా చేశారు డిప్యుటీ సీఏం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు. సీబీఐ ఇచ్చిన నివేదికతో తాను చేసిన ప్రచారంలో నిజం లేదని ప్రజలకి అర్ధమైందని, తాను ప్రజల్లో తిరుమల ప్రసాధం విషయంలో పలుచన అయ్యానని తేలేసరికి, మీడియా సమావేశం పెట్టి మరీ ప్రతిపక్షనేత జగన్ పై మతతత్వ దాడికి పూనుకున్నారు. జగన్(Jagan) తిరుమల కొండపై పగ పట్టారంటూ, నాడు కూడా తిరుమల 7 కొండలు ఎందుకు రెండు కొండలు చాలన్నారంటూ మరో అసత్యాన్ని అలవోకగా ప్రెస్ ముందే పలికేసారు డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ గారు.

వైయస్ రాజశేఖర రెడ్డి (Y. S. Rajasekhara Reddy) గారి పాలనా కాలంలో తెలుగుదేశం పార్టీ పుట్టించిన ఒక అబద్దపు ప్రచారమే ఈ 2 కొండల వివాదం అని ఎన్ని సార్లు ప్రజాస్వామ్య వాదులు సాక్ష్యాలతో చూపించినా మళ్ళీ అదే అసత్యాన్ని ప్రచారం చేయడంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఉద్దేశం ఎంటి? రాష్ట్రాన్ని అసత్యాలతోనే పాలించాలని నిర్ణయానికి వచ్చారా ? ప్రజలకి సమాదానం చెప్పాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వాఖ్యల్లో నిజనిజాలు మరోసారి ప్రజలు ఉందు ఉంచాల్సిన అవసరం ఉంది. తద్వారా రాష్ట్రంలో మత విద్వేషాలు పెరగకూడదు అనే అభిప్రాయమే ఇక్కడ ప్రధానం . నాడు జరిగ ప్రచారం వివరంగా

2005లో తిరుమల గ్రామంలో పంచాయతి ఎన్నికలు జరగాలని ఒక గ్రామ స్థాయి టీడీపీ నాయకుడు హై కోర్టులో కేసు వేశాడు. అయితే ఇది నాటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు (N. Chandrababu Naidu) గారే ఒక అనామకుడిని అడ్డు పెట్టి హైకోర్టులో కేస్ వేయించారని ప్రచారంలో ఉంది. ఈ కేసులో టీడీపీ వారి వాదన ఎంటంటే “తిరుమలలో ఒక స్థానిక సంస్థ అనేది లేకపోవడం, ఎన్నికయిన పాలనా సంస్థ లేకపోవడం రాజ్యాంగ విరుద్ధమని. 1993లో రాజ్యాంగాన్ని 73, 74వ సవరణల ద్వారా మార్చిన తరువాత దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థలు లేకపోవడం, ఎన్నికైన స్థానిక పాలనాయంత్రాంగం లేకపోవడం జరగడానికి వీలులేదని. పెద్ద ఊరయితే మునిసిపాలిటీ ఉండాలి, చిన్న ఊరయితే పంచాయితీ ఉండాలి. పంచాయితీకి తగినంత జనాభా లేనట్లయితే పక్కనున్న ఏదైనా గ్రామ పంచాయితీలో భాగం చేయాలి. అంతే తప్ప స్థానిక సంస్థ ఏదీలేని మానవ ఆవాసం ఉండడానికి వీలులేదని” కొర్టులో కేసు వేయించారు.

అయితే తిరుమల పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మికం తప్ప రాజకీయం తగదనే ఉద్దేశంతో 2005న పంచాయితి రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న జేసి దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) గారి ఆద్వర్యంలో ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక జీఓ విడుదల చెసింది (జీవో నెంబర్ 338). ఆ జీఓలో తిరుమలలో 27.5 చదరపు కిలోమీటర్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి, కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్ళు, యాత్రికుల ప్రయొజనాలకోసం ఏర్పర్చిన గ్రుహాలు, మరియు చుట్టుపక్కన ఉన్న ఇళ్ళు అన్ని కలిపి ఒక పవిత్ర స్థలంగా ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు, మీటింగులు జరగటానికి వీలు లేదని చెబుతు జీఓని విడుదల చేశారు. ఈ జీవో ముఖ్య ఉద్దేశం రాజకీయాలకి దూరంగా పవిత్ర తిరుమల క్షేత్రం ఉండాలని. ఇది ఆశించే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి గారు ఈ జీఓ ఇచ్చారు. మనుషులు సంచారం ఉన్నంత వరకు తిరుమల గ్రామం విస్తీర్ణం చెబుతూ వైయస్ రాజశేఖర రెడ్డి గారు ఈ జీఓ ఇవ్వడానికి ఆదారంగా తీసుకున్నది. గత ప్రభుత్వాల కాలంలో ఉన్న జీవోలు.

1975 డిసెంబర్ 2న విడుదల చెసిన జీవో నెంబర్ 1605, మరియు 4 నవంబర్ 1965న విడుదల చెసిన జీవో 1784ని. అలాగే 1986లో ఎన్టీఆర్ గారు ఏర్పాటు చేసిన చల్లా కొండయ్య కమీషన్ కూడా స్వామివారి ఆలయం చుట్టు ఉన్న 10.1/3 చదరపు మైళ్ళ విస్తీర్ణ ప్రాంతం మాత్రమే తిరుమల క్షేత్రానికి మంజూరు అయిందని చెప్పారు. ఇక్కడ కూడా ఆ కమీషన్ ఏడుకొండల విస్త్రీణం మోత్తం తిరుమల గ్రామమని చెప్పలేదు.

ఇంకా ఎన్టీఆర్ గారు ఏర్పాటు చేసిన చల్లా కొండయ్య కమీషన్ తిరుమల పవిత్రతని కాపాడటానికి తిరుమలలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకి తావు ఇవ్వకూడదని కూడా చెప్పారు. దీనినే వైయస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల పవిత్రతను కాపాడటానికి అమలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో వచ్చిన జీవోలు, కమీషన్ల రిపోర్టుల ఆదారంగా తీసుకుని తిరుమల కొండపై జనసంచారం ఉన్న ప్రదేశం విస్తీర్ణాన్ని అందులో ఉనట్టే చెప్పారు. మిగత స్థలం అంత దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం చెతులో ఉంటది కాబట్టి జీవోలో వాటి ప్రస్తావన ఉదహరించలేదు. ఉదహరించే అవకాశం చట్టప్రకారం కూడా వైయస్ రాజశేఖర రెడ్డి గారికి లేదు.

ఈ జీవో కాపీని పట్టుకుని ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టి, వైయస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల ఏడు కొండలని రెండు కొండలుగా చేశారని ప్రచారం అందుకున్నారు – (వాస్థవంగా చూస్తే ఆ జీవో ముఖ్య ఉద్దేశం జనసంచారం మాత్రమే ఉన్న తిరుమల ప్రాంతంలో ఎలాంటి రాజకీయ కర్యాకలాపాలు ఉండటానికి లేదని చెప్పటం) 1925 నుండి విలేజ్ రికార్డ్ లో ఉన్న విస్తీర్ణం కూడా ఇంతే – ఇందులో వైయస్ రాజశేఖర రెడ్డి గారు మార్చింది లేదనేది సుస్పష్టం.

అయితే ప్రతిపక్షాలు మాటలు నమ్మి, తిరుమల కొండ విస్తీర్ణంపై , ప్రభుత్వాల దగ్గర ఉన్న గజెట్ల చరిత్రపై అవగాహన లేని కొంత మంది సాధువులు 2006 జులై 15న నిరసన వ్యక్తం చేశారు. ఇలా చేస్తూ వారు తిరుమలని కిలో మీట్లర్ల విస్తీర్ణంలా కాకుండా ఏడు కొండలని మార్చి జీవో ఇవ్వాలని వైయస్ రాజశేఖర రెడ్డి గారిని కోరుకున్నారు. అలాగే 27 జులై 2006న టిటిడి అదారిటి ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తు తిరుమల అంటే 27.5 చదరపు కిలో మిటర్ల విస్త్రీణం మాత్రమే కాదు మోత్తం అటవీ ప్రాంతంతో సహా అంత కలిపి 332 చదరపు కిలో మీటర్ల ప్రాంతం అని కొత్త జీవో ఇవ్వాలని నాటి ప్రభుత్వాన్ని కోరారు.

అదే రోజున ప్రభుత్వ కెబినెట్ అప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కింద లేని అటవి ప్రాంతాన్ని వీరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని కెంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వైయస్ రాజశేఖర రెడ్డి గారు కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం సైతం ఆ అటవీ ప్రాంతం మోత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చేసింది. వైయస్సార్ ప్రభుత్వానికి ఆ అటవీ ప్రాంతంపై అధికారం రాగానే, 2007 జూన్ 2న ఏడు కొండలు అంటే శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, ౠషబాద్రి తిరుమలకి సంభందిచిన పవిత్ర ప్రదేశం అని జీవో నెంబర్ 746ని విడుదల చేశారు, దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం నిషిద్దం అని 747 జీవోని విడుదల చేశారు వైయస్ రాజశేఖర రెడ్డి గారు.

వైయస్ రాజశేఖర రెడ్డి గారు అదే 2006 ఆగస్టున తిరుపతిలో “యస్వి వేదిక్ విశ్వ విద్యాలయం” ప్రారంబిస్తు తిరుమల కొండల విషయంలో తెలుగుదేశం పార్టీ మీడియాని అడ్డుపెట్టుకుని సాగిస్తున్న అసత్య ప్రచారాలు ఆపాలని, ఎట్టి పరిస్తుతులల్లోను తిరుమల, ఏడు కొండలు అంగులం కూడా కదిలించాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని, ఆ పాపంకి వడికట్టామనే ప్రచారం మానుకొవాలని హితవు పలికారు.

ఇలా రాజకీయాల నుండి తిరుమల దివ్యక్షేత్రం పవిత్రతని కాపాడుదాం అని ఆలోచించిన వైయస్ రాజశేఖర రెడ్డి గారిపైన కేవలం రాజకీయ లబ్ధి కొసమే దేవుడిని కూడా అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు తెలుగుదేశం వారని ప్రజల నుండే నాడు వినిపించిన మాట, దీనికి టీడీపీని మొసే పత్రికలు వంత పాడాయి – నేడు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో మాదిరే నాడు కూడా హిందు ధర్మం మీద అత్యంత విశ్వాసం ఉన్నవాళ్ళ మనొభావాలు గాయపడ్డాయి – లేదు నాటి ప్రతిపక్షాలు వాటి అనుభంద మీడియా సంస్థలు గాయ పడేలా చేశారు… ఇప్పటికైనా విజ్ఞులు నిజాలు గ్రహిస్తారని ఆసిస్తున్నారు ప్రజాస్వామ్య వాదులు. ముఖ్యంగా రాష్ట్రంలో మత రాజకీయాల మాటున పదవులు పోందాలని కాచుకుని కూర్చున్న రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదే రాష్ట్ర భవిష్యత్తుకు శ్రేయస్కరమని వారి అభిప్రయం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment