---Advertisement---

జోగి రమేష్ ఇంటికి నేడు వైఎస్ జగన్.. పోలీసుల ఆంక్షలతో ఉత్కంఠ

February 6, 2026

Summarize with AI

---Advertisement---

జగన్ పర్యటనపై నోటీసులు, రూట్ మ్యాప్ చుట్టూ హైటెన్షన్

మాజీ మంత్రి జోగి రమేష్‌పై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఇబ్రహీంపట్నం వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జగన్, ఉదయం 11 గంటలకు జోగి రమేష్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

అయితే జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వెస్ట్ బైపాస్ మార్గంలోనే కాన్వాయ్ వెళ్లాలని నగర సీపీ రాజశేఖర్ పార్టీ ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. అలాగే పర్యటనలో పాల్గొనకుండా పలువురు వైసీపీ నేతలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఈ పోలీసు ఆంక్షల నేపథ్యంలో జగన్ పర్యటన రూట్ మ్యాప్‌పై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment