ఏపీ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ (Jogi Ramesh) నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, రాజకీయ ఉద్రిక్తతలపై తీవ్రంగా స్పందించారు.
టీడీపీ ప్రశ్నిస్తే దాడులేనా?
పోలీసుల సమక్షంలోనే టీడీపీ(TDP) కార్యకర్తలు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని, ఐదు కార్లు ధ్వంసం చేసి మహిళలను దూషించారని తెలిపారు. ఇదే తరహాలో జోగి రమేష్ ఇంటిపైనా దాడి జరిగిందన్నారు.
లడ్డూ వివాదంపై మాట్లాడుతూ, సీబీఐ చార్జ్‌షీట్‌లో లడ్డూలో జంతువుల కొవ్వు లేదని స్పష్టంగా ఉందని జగన్ పేర్కొన్నారు. 2024 జూలై 25న నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినప్పటికీ, అవే మళ్లీ వైష్ణవీ డైరీ రూపంలో తెచ్చి ఉపయోగించారని చార్జ్‌షీట్‌లో ఉందని తెలిపారు. అంటే చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు (Adulterated Ghee Tankers) వాడారని అన్నారు.
స్వార్థ రాజకీయాల కోసమే లడ్డూలో కొవ్వు కలిసిందని చంద్రబాబు ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబు తప్ప ఇంకెవరైనా అలా అన్నారా? అని ప్రశ్నించారు.






