---Advertisement---

తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లకు అనుమతి- ఇరకాటంలో బాబు సర్కార్

February 7, 2026

---Advertisement---

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఉత్పన్నమైన వివాదం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి, వాటిలో వాస్తవం లేదని స్పష్టమైన నివేదికను సమర్పించడంతో భక్తులు ఊరట చెందారు.

అయితే, అదే సీబీఐ నివేదికలో మరో ఆశ్చర్యకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాణ్యత ప్రమాణాలు లేవని పేర్కొంటూ టీటీడీ నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించింది. కానీ, ఆ ట్యాంకర్లు మరో డైరీ పేరుతో—వైష్ణవీ డైరీగా—తిరిగి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే టీటీడీ వాటికి అనుమతి ఇచ్చినట్లు సీబీఐ వెల్లడించింది.

సీబీఐ చార్జ్‌షీట్ ప్రకారం, మొదట తిరస్కరించబడిన అదే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించినట్టు స్పష్టంగా పేర్కొంది. ఇది చంద్రబాబు ప్రభుత్వ కాలంలో జరిగిన పరిపాలనా లోపమని సీబీఐ స్పష్టం చేయడం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.

ఈ అంశాన్ని ప్రతిపక్షమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా లేవనెత్తడంతో, తిరుమల ప్రసాదం నాణ్యతపై భక్తుల్లో మరోసారి ఆందోళన నెలకొంది. ప్రతిపక్ష నేతలు సీబీఐ నివేదికను ఆధారంగా చూపిస్తూ, ఈ తప్పిదాలకు బాధ్యత ఎవరిది? పాలనలో ఉన్నవారి నిర్లక్ష్యమేనా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు తిరుమల లడ్డూ వివాదాన్ని మరింత వేడేక్కన్నుందనే వాతావరణం కనిపిస్తుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment