ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) సొంత సంస్థగా పేరుగాంచిన హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods) మరోసారి వివాదాల కేంద్రంగా నిలిచింది. ఆ సంస్థ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ‘టోటల్ కర్డ్’ పెరుగు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని, అందులో ఉండాల్సిన కనీస పాల–ఫ్యాట్ (Minimum Milk Fat) కూడా లేనట్టు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) (FSSAI) అధికారికంగా నిర్ధారించింది. ఈ కారణంగా హర్యానాలోని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ డిప్యూటీ కమిషనర్ హెరిటేజ్ సంస్థపై రూ.లక్ష జరిమానా విధించారు. సంస్థ ఆ జరిమానాను చెల్లించిన విషయాన్ని సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ మార్కెట్‌కు స్వయంగా వెల్లడించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హెరిటేజ్ సంస్థపై ఇలాంటి నాసిరకం ఆరోపణలు కోత్త కాదు గతంలోను తెలంగాణ అసెంబ్లీలో హెరిటేజ్ పాలల్లో నాన్యతలేదని అధికారులు గుర్తించిన అంశంపై వాడివేడిగా చర్చలు సాగాయి. అలాగే కేరళ ప్రభుత్వం (Kerala Government) సైతం హెరిటేజ్ పాలను నిషేధించినట్టు దానికి సంభందించిన గజెట్ ను ఆగస్టు 2012లో విడుదల చేసింది, అందులో ఫార్మాలిన్‌ను సంరక్షక పదార్థంగా కలుపుతున్నారని అది ఆరోగ్యానికి హానికరం అని ఆ గజెట్ లో పెర్కోనట్టు వార్తలు వెలువడ్డాయి. ఏది ఏమైనా పాలు మరియు పెరుగు వంటి నిత్య వినియోగ ఉత్పత్తుల్లో నాణ్యత లోపాలు తలెత్తడం వినియోగదారుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సొంత సంస్థ ఉత్పత్తుల్లో ఇలాంటి లోపాలు కనిపించడం ఏమాత్రం సమంజసం కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.






