---Advertisement---

‘కమ్మ’గా రాష్ట్ర పాలన – ఆదినారాయణ రెడ్డి సంచలన వాఖ్యలు

February 9, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవానికి అది ఇంకా ‘కమ్మ’ (Kamma)గానే కొనసాగుతోందని జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే (BJP MLA) ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన బిజెపి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమిలోని పార్టీల మధ్య స్పష్టమైన గ్యాప్‌ ఉందని సూచిస్తూ, కులాలకు అతీతంగా సమానత్వం పాటించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిందేనని, ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు.

బిజెపి మద్దతు లేకుండా టిడిపి(TDP), జనసేన పార్టీలకు (Jana Sena Party) రాష్ట్రంలో స్థానం లేదని వ్యాఖ్యానించిన ఆయన, కూటమికి పునాది బిజెపియేనని స్పష్టంగా చెప్పారు. కూటమిలో బిజెపి ప్రాధాన్యతను క్యాడర్‌లో బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో బిజెపి కార్యకర్తలకు తగిన గుర్తింపు, పదవుల పంపకాల్లో సరైన ప్రాధాన్యత లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు శ్రమించిన బిజెపి నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో తీర్మానించారు. రాష్ట్ర అధ్యక్షులు మాదవ్‌ (Madhav) సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

కూటమిలో ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్రంలో నడుస్తున్న పరిపాలన తీరుపై ఒక్కోరరు తమ అసంతృప్తిని ఏదోక రూపంలో వెళ్లకక్కడం కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు (Vishnu Kumar Raju) భోగాపురం విమానాశ్రయం రోడ్డు విస్తరణ పనులపై ప్రభుత్వనికి చురకలు అంటించగా ఇప్పుడు మరో బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి ఏకంగా కుల పరంగా జరుగుతున్న అన్యాయంపై మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశం అయింది. రానున్న రోజుల్లో కూటమి భీటలు తప్పవా అన్న సంకేతాలు ఇలాంటి వాఖ్యలు వలన ఏర్పడుతున్నాయని రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment