---Advertisement---

దక్షిణ రాష్ట్రాల్లో ఇంఫ్లూయన్స్ లీడర్ గా జగన్?

February 9, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ (YS Jagan Mohan Reddy) గురించి ఇప్పుడు నెట్టింట్లో ఒక హాట్ డిస్కషన్ మోదలైంది. నిన్నటిరోజున జగన్ పెదనాన్న వైయస్ జార్జ్ రెడ్డి (YS George Reddy) మనవడు వైయస్ సునీల్ రెడ్డి (YS Sunil Reddy) కొడుకు వైయస్ సాహిల్ రెడ్డి (YS Sahil Reddy) పెళ్ళి వేడుక ఇప్పడు ఏపీ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. చెన్నై లీలా ప్యాలెస్ లో జరిగిన ఈ పెళ్ళి వేడుకకి తమిళనాడు సినీ రాజకీయప్రముఖులు అందరూ హాజరవ్వడం. వారు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో చాలా సన్నిహితంగా మెలగడం చూసిన వాళ్ళు .. జగన్ కు తమిళనాడు సీనీ రాజకీయ వర్గాల్లో ఇంత ఇంఫ్లుయన్స్ (Influence) ఉందా అనే చర్చ మోదలైంది.

నిజానికి జగన్ కు బెంగుళూరు కేంద్రంగా కర్నాటకా రాష్ట్రంలో ఉన్న పలుకుబడి తెలిసిన విషయమే . జగన్ రాజకీయాల్లోకి రాక ముందు తన వ్యాపార సామ్రాజ్యాన్ని కర్నాటక నుండే ప్రారంభించడం. బెంగుళూరు యల్లహంకా గృహం కేంద్రంగా తన వ్యాపార సామ్రాజ్యాని విస్తరించడం విదితమే . తద్వారా జగన్ కి బెంగుళూరులో రాజకీయ వ్యాపార వర్గాల్లో ఉన్న పలుకుబడి ఇప్పటికే రాజకీయ వర్గాలు చర్చించుకునే అంశం. అలాగే ఆంద్రప్రదేశ్ లో ప్రముఖ రాజకీయ పార్టీగా చెక్కుచెదరని 40% ఓట్ల శాతం పోందే వ్యక్తిగా, ఇక తెలంగాణ రాష్ట్రంలో సైతం అభిమానులు, రాజకీయ సంభంధాలు, వ్యాపార సంభంధాలు బలంగా ఉన్నవారిగా ఇరు తెలుగు రాష్ట్రల్లో జగన్ ముద్ర సుస్పష్టం.

దక్షిణ భారత దేశంలో ముఖ్య రాష్ట్రాలుగా ఉన్న కర్నాటకా, ఆంధ్రా, తెలంగాణలో ఇప్పటికే జగన్ కు తనదైన బలమైన ముద్ర ఉందని రాజకీయ వర్గాల్లో ఉన్న నేపధ్యంలో , సోదరుడు సునీల్ రెడ్డి ఇంట వివాహంతో అక్కడికి వచ్చిన రాజకీయ ప్రముఖులు ముఖ్యంగా అధికార పార్టీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నాయకులు, కోత్తగా పార్టీ పెట్టి ప్రజల్లో దూసుకుపోతున్న దళపతి విజయ్ లాంటి దిగ్గజాలు హాజరవ్వడమే కాక జగన్ తో అత్యంత సన్నిహితంగా మెలగడం చూసిన వారికి జగన్ బలం తమిళ నాట ఇంత ఉందా అంటూ చర్చించుకోవడం గమనార్హం . ఈ పరిణామాలు అన్ని గమనించిన వారు జగన్ సౌత్ లోనే బలమైన నాయకుడుగా ఉన్నాడంటూ నెటింట్లో చర్చించుకోవడం ఇప్పుడూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment