చతురామ్నాయ పీఠాలను ఆది శంకరాచార్యులు (Adi Shankaracharya) ఏర్పాటు చేయలేదంటూ చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swami) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై శివ పీఠాధిపతి శివస్వామి (Shaiva Peethadhipathi Shiva Swami) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, వాటిని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠాల ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని శివస్వామి విమర్శించారు. ఇది చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా కనిపిస్తోందని, ఇలాంటి పరిస్థితులు సమాజంలో గందరగోళం సృష్టిస్తాయని అన్నారు.
వైష్ణవులు, శైవులు తమ తమ సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు కల్లోలం రేపేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చినజీయర్ స్వామి సంయమనం పాటించాలని సూచించారు.
చినజీయర్ స్వామి హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శివస్వామి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే ప్రశాంతంగా ఉండనివ్వబోమని కూడా హెచ్చరించారు







