తిరుమల కొండల (Tirumala Hills) విస్తీర్ణంపై దశాబ్ధాలుగా తెలుగుదేశం (TDP) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల (YSRCP) మద్య జరుగుతున్న మాటల యుద్దం తెలిసిందే. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి (Dr. Y.S. Rajasekhara Reddy – YSR) గారు తిరుమల 7 కొండలను రెండు కొండలు చేయడానికి ప్రయత్నించారని తెలుగుదేశం తీవ్రమైన ఆరోపణలు చేస్తే. ఆ ఆరోపణను కొట్టి పారేస్తూ నందమూరి తారక రామారావు గారి పాలనలోనే నియమించిన చెల్లా కొండయ్య కమీషన్ (Chella Kondiah Commission) ఇచ్చిన నివేదిక అలాగే 1965,1975 నాటి ప్రభుత్వాలు ఇచ్చిన జీవోల ఆధారంగానే తిరుమల విస్తీర్ణం ఉదహారిస్తూ అక్కడ ఎలాంటి ఎన్నికలు కానీ రాజకీయ సభలు సమావేశాలు జరగడానికి వీరు లేకుండా తీరుమల పవిత్రతను కాపాడటంలో భాగంగా డాక్టర్ వైయస్సార్ గారు జీవో విడుదల చేశారని నాటి జీవోలతో సహా సాక్ష్యాలు చూపిస్తూ తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలను కొట్టి పారేస్తూ వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
ఈ నేపధ్యంలోనే నాడు వైయస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో అధికారికంగా ఎవ్వరు చేయని విధంగా తిరుమల 7 కొండలు శ్రీవారికే చెందుతాయని ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయాలు కాని, అన్యమత ప్రచారాలు కానీ చేయడానికి వీలు లేదని జీవో ఇస్తూ రాజముద్ర వేశారు. నాడు వైయస్సార్ ఇచ్చిన జీవోతోనే తోలి సారిగా తిరుమల 7కొండలు శ్రీవారికి చెందిన ఆస్తని ప్రభుత్వం రాజముద్ర వేసినట్టయింది. ఈ చరిత్ర మోత్తం ఇటీవల కాలంలో సాక్ష్యాలతో సహా భయటపడటంతో తిరుమల విషయంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై దశాబ్దకాలంగా టీడీపీ చేస్తూ వచ్చిన రెండు కోండల ఆరోపణ బూటమని తేలిపోయింది.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా టీం మరోక షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన 7 కొండల జీవోని చంద్రబాబు రద్దు చేస్తానని బహిరంగమగా 2009లో ఎన్నికల హామీ ఇచ్చినట్టు వారు ఆధారాలతో భయట పెట్టారు. గుంటూరు సమీపంలో 27 జనవరి 2009న బైబిల్ మిషన్ 71వ రాష్ట్ర సదస్సులో చంద్రబాబు గారు మాట్లాడుతూ, జీఓ 746 తిరుమల 7 కొండలు శ్రీవారికే చెందిన పుణ్యక్షేత్రాలుగా, అలాగే హిందూ దేవాలయాల పరిసర ప్రాంతాల్లో మత మార్పిడి కార్యకలాపాలను నిషేధించే జీఓ 747ను కూడా చంద్రబాబు రద్దు చేస్తానని ఆ సభలో ఎన్నికల హామీ ఇచ్చినట్టు వారు సాక్ష్యాలు బయట పెట్టారు.
చంద్రబాబుకి (Chandrababu Naidu) అత్యంత సన్నిహితుడిగా మెలిగిన పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి చంద్రబాబు గారు ఇచ్చిన ఈ హామీ విషయమై తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2009 ఫిబ్రవరీ నెలలో రాసిన సుదీర్ఘ లేఖను ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వారు బయట పెట్టారు. ఈ లేఖ బహిర్గతం అవ్వడంతో చంద్రబాబు గారే తిరుమల శ్రీవారికి 7 కొండలు చెందుతాయనే జీవోని వ్యతిరేకించినట్టు అర్ధమౌతుంది. ఈ నేపధ్యంలో ఇన్నిరోజులు తెలుగుదేశం చేసిన ప్రచారం వట్టి బూటకమని తేలడంతో పాటు ఏడుకొండలవాడికి ,7 కోండలు చెందుతాయని అధికార జీవో ఇచ్చింది వైయస్సార్ అయితే దానిని వ్యతిరేకిస్తూ ఆ జీవో ని రద్దు చేస్తామని హమీ ఇచ్చింది మాత్రం చంద్రబాబు గారని స్పష్టంగా కనిపిస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడీయా విభాగం విడుదల చేసిన ఈ లేఖతో తెలుగుదేశం పూర్తిగా డిఫెన్స్ లో పడిపొయే పరిస్థితి కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట.







