శ్రీశైలంలో (Srisailam) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల (Maha Shivaratri Brahmotsavams) సందర్భంగా శతాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయాలు ఈ ఏడాది భంగపడ్డాయనే వార్తలు వస్తున్నాయి. ప్రతీ ఏటా రెండో రోజు సాయంత్రం ద్వారకా తిరుమల ఆలయం తరఫున స్వామి–అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ జరగడం, అనంతరం భృంగి వాహనంపై గ్రామోత్సవం (Gramotsavam) నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఉత్సవం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించేది.
కానీ ఈసారి భక్తుల రద్దీ అంచనా వేయడంలో ఆలయ అధికారుల నిర్వాహక లోపాల కారణంగా ఉత్సవమూర్తులు రాజగోపురం దాటలేని పరిస్థితి ఏర్పడిందని. ఫలితంగా గ్రామోత్సవం రద్దుకావడమే కాకుండా, ద్వారకా తిరుమల నుండి వచ్చ్హే పట్టువస్త్రాల సమర్పణ కూడా జరగలేదని. ఆలయ ప్రాంగణంలోనే పరిమిత పూజలతో సరిపెట్టాల్సి వచ్చిందనే వార్తలు భక్తుల ఆవేదనకి గురిచేస్తుంది.
గ్రామోత్సవం లేకపోవడాన్ని భక్తులు ఘోర అపచారంగా భావిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో శివస్వాములపై లాఠీచార్జ్ జరగడం ప్రభుత్వ నిర్వహణపై మరింత అసంతృప్తిని రేకెత్తించింది. పవిత్ర క్షేత్రంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు శివ భక్తులను కలతకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనలపై కూటమి ప్రభుత్వం నుండి వివరణ ఇవ్వాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.







