---Advertisement---

తిరుమల నెయ్యి కాంట్రాక్టు వెనుక హెరిటేజ్ సిండికేట్‌? వైసీపీ సంచలన ఆరోపణలు.

February 13, 2026

---Advertisement---

తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదానికి (Laddu Prasadam) వినియోగించే నెయ్యి కాంట్రాక్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ(YSRCP) నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) హెరిటేజ్ సంస్థలతో (Heritage Foods) సంబంధం ఉన్న ఇందాపూర్ డెయిరీ (Indapur Dairy)పై తీవ్ర ఆరోపణలు చేశారు. హెరిటేజ్‌కు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీకి టెండర్ అర్హతలు లేకపోయినా, తిరుమల నుండి 800 కిలోమీటర్ల పరిధి నిబంధనను పక్కనపెట్టి 883 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారనే విమర్శలు గుప్పించారు.

2014-19 కాలంలో హెరిటేజ్ సిండికేట్‌కు చెందిన 22 సంస్థలకు కోట్ల విలువైన నెయ్యి సప్లై కాంట్రాక్టులు కేటాయించారని భూమన ఆరోపించారు. అప్పుడు కిలోకు రూ.278కే కాంట్రాక్టులు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అధిక ధర అయిన రూ.658 చెల్లిస్తూ కాంట్రాక్టు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇతర ప్రముఖ డెయిరీలు టెండర్లలో పాల్గొనకపోవడానికి ఒత్తిళ్లు కారణమా అనే అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు.

టీఋఈడీ టెండర్ నిబంధనల ప్రకారం 800 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీల నుంచే నెయ్యి కొనుగోలు చేయాలని ఉన్నప్పటికీ, మహారాష్ట్రలోని ఇందాపూర్ కు చెందిన డెయిరీకి కాంట్రాక్టు కేటాయించడం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడును (B.R. Naidu) లక్ష్యంగా చేసుకుని భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) కఠిన ప్రశ్నలు లేవనెత్తారు.

హెరిటేజ్ సంస్థల ప్రయోజనాల కోసమే ఈ కుట్ర జరిగిందా? పవిత్ర లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఈ ఆరోపణలపై ప్రభుత్వం, టిటిడి నుంచి స్పష్టమైన వివరణ రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment