---Advertisement---

నేలకూలిన మద్దిరాల ప్రభ – తృటిలో తప్పిన పెను ప్రమాదం

February 16, 2026

---Advertisement---

కోటప్పకొండలో (Kotappakonda) అంగరంగ వైభవంగా జరిగిన ప్రభల తీర్ధం అనంతరం తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా అపసృతి చోటు చేసుకుంది. మద్దిరాల (Maddirala) గ్రామానికి చెందిన ప్రభ ముందుకు కదులుతున్న సమయంలో నెలకూలిపోవడంతో అక్కడికక్కడే కొంతసేపు గందరగోళం నెలకొంది. ప్రభ ఒరిగినా ఎవరికి ఎలాంటి గాయాలు కానందుకు భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇదిలాఉంటే, నిన్న మాత్రం కొంతమంది తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కార్యకర్తలు పాత వీడియోను ప్రచారం చేస్తూ, వైసీపీ ప్రభకు నిప్పంటుకున్నట్టు తప్పుడు వార్తలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారు. 11 సంవత్సరాల నాటి వీడియోను తాజాగా జరిగిన ఘటనగా చూపిస్తూ ప్రజల్లో అయోమయం కలిగించే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో భక్తుల్లో కలిగిన అనుమానాలను నివృత్తి చేస్తూ పల్నాడు జిల్లా పోలీసు శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కోటప్పకొండలో ఎలాంటి ప్రభకు నిప్పంటుకున్న ఘటన జరుగలేదని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వీడియో పూర్తి వదంతి మాత్రమేనని స్పష్టం చేసింది. దీంతో భక్తులు కుదుటపడ్డారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment