---Advertisement---

సంజీవినీ ప్రోగ్రాంలో “బిల్ గేట్స్” పాత్రపై స్పష్టత ఏది?

February 16, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రచారం చేస్తూ సంజీవినీ ప్రోగ్రాంను (Sanjeevini Program) ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని బిల్ గేట్స్ (Bill Gates) సహకారంతో రాష్ట్ర వైద్య రంగంలో డిజిటల్ విప్లవంగా రూపుదిద్దుతున్నామని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక డిజిటల్ వైద్య సేవలు, వ్యక్తిగత హెల్త్ రికార్డులు, ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ నివేదికలు, వ్యాక్సినేషన్ వివరాలు అన్ని ఒకే చోట అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చింది.

ఈ కార్యక్రమంలో బిల్ల్ & మిలిందా గేట్స్ ఫౌండేషన్ (Bill & Melinda Gates Foundation) మరియు టీసీఎస్ (TCS) భాగస్వాములుగా ఉన్నట్లు ప్రకటించారు. అదనంగా ఉచిత వైద్య పరీక్షలు, మాతా-శిశు సంరక్షణ సేవలు, ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

అయితే, ఈ ప్రాజెక్టులో గేట్స్ ఫౌండేషన్ అందించే సహకారం ఏమిటనే విషయంపై స్పష్టత లేదనేది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా కోట్లాది మందికి హెల్త్ అకౌంట్లు సృష్టించబడ్డాయి. డిజిటల్ హెల్త్ రికార్డుల వ్యవస్థ అమల్లో ఉన్న నేపథ్యంలో, సంజీవినీ ప్రత్యేకత ఏమిటి? గేట్స్ ఫౌండేషన్ పాత్ర ఏ మేరకు పరిమితమవుతుందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు.

ఇంకా, గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు నిధులు అందిస్తుందా? లేదా ఆరోగ్య బీమా ప్రీమియంలకు ఆర్థిక సహాయం చేస్తుందా? అనే ప్రశ్నలకు కూడా స్పష్టమైన సమాధానం లభించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బిల్ గేట్స్ పేరును ముందుకు తెచ్చి ప్రచారం చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అంతేకాక, గతంలో క్లినికల్ ట్రయల్స్ అంశంపై గేట్స్ ఫౌండేషన్‌పై వచ్చిన ఆరోపణలు కూడా ప్రజల్లో ఆందోళనలకు కారణమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం, పారదర్శకంగా ఒప్పంద వివరాలను వెల్లడించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా భావించబడుతోంది. సంజీవినీ ప్రోగ్రాం నిజంగా ఆరోగ్య విప్లవానికి నాంది అవుతుందా? లేక రాజకీయ ప్రచారానికి పరిమితమవుతుందా? అన్నది కాలమే సమాధానం చెబుతుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment