---Advertisement---

మదనపల్లి నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య?

February 18, 2026

---Advertisement---

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మదనపల్లి (Madanapalle) ఘటనలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మదనపల్లి పట్టణంలోని నీరు గట్టువారిపల్లిలో (Neeru Gattuvaaripalli) ఏడేళ్ల బాలికపై (7-Year-Old Girl) అత్యాచారం (Rape) చేసి హత్యకు పాల్పడిన నిందితుడు కులవర్ధన్ (Kulavardhan) మృతదేహంగా కనుగొనబడ్డాడు. ఈ ఘటన ఇప్పటికే ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించగా, నిందితుడి అనుమానాస్పద మృతి కేసుకు కొత్త మలుపు తిప్పింది.

పోలీసుల వివరాల ప్రకారం, కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ శవమై తేలాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లిలోని మార్చురీకి తరలించారు.

ఏడేళ్ల చిన్నారి పై జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరే ఇతర కారణాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment