---Advertisement---

నారా లోకేష్ పై జూపిటర్ ఆస్ట్రాలజీ చెప్పిన జోస్యం నిజమౌతుందా?

February 21, 2026

Summarize with AI

---Advertisement---

గ్రహాలు, నక్షత్రాలు, రాశుల స్థితిగతుల ఆధారంగా మానవ జీవితాన్ని విశ్లేషించే జ్యోతిషశాస్త్రం భారతీయ సంస్కృతిలో ప్రాచీనమైన స్థానం సంపాదించుకుంది. కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని నవగ్రహాల ప్రభావం మనుష్యుల జీవితంలోని శుభాశుభాలను నిర్ధేశిస్తుందని విశ్వాసం. ముఖ్యంగా హిందూ సమాజంలో జాతక చక్రం ఆధారంగా వ్యక్తిగత, సామాజిక, రాజకీయ నిర్ణయాలు తీసుకునే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు కూడా జ్యోతిష్యంపై విశ్వాసం ఉంచుతున్నారనే చర్చ తరచుగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు (Astrologer) సుందర్ బాలకృష్ణన్ (Sundar Balakrishnan) తన సామాజిక మాధ్యమ ఖాతాలో 2025 అక్టోబరులో చేసిన ఒక భవిష్యవాణి ఇప్పుడు విస్తృత చర్చకు దారితీసింది. ఆయన ప్రకారం, 2026 జనవరి నుండి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కీలక మార్పులు సంభవించే అవకాశం ఉందని, ముఖ్యంగా నారా లోకేష్ (Nara Lokesh) పలు వివాదాల్లో చిక్కుకునే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక, భూకేటాయింపులు, పరిపాలనా నిర్ణయాలకు సంబంధించిన అంశాలు వివాదాస్పదమయ్యే అవకాశముందని కూడా అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం పరిశ్రమలకు భూ కేటాయింపులు, పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల టెండర్లు, తిరుమల నెయ్యి సరఫరా ఒప్పందాలు, అలాగే మహారాష్ట్ర అజిత్ పవార్ మరణాం ఆపై రాజకీయ పరిణామాలకు సంబంధించిన ఆరోపణలు వంటి అంశాలు ప్రజల మద్య చర్చలో నిలుస్తున్నాయి. ఈ పరిణామాలను కొందరు జ్యోతిష్యుడి భవిష్యవాణితో అనుసంధానం చేస్తుండగా, మరికొందరు ఇవన్నీ సాధారణ రాజకీయ ప్రక్రియల భాగమని వాదిస్తున్నారు.

జ్యోతిష్యంపై విశ్వాసం ఉన్న వర్గాలు ఈ సంఘటనలను గ్రహగతుల ప్రభావంగా భావిస్తుండగా, విమర్శకులు మాత్రం పరిపాలనా పారదర్శకత, రాజకీయ బాధ్యతల కోణంలో విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్య భవిష్యవాణి, రాజకీయ వాస్తవాలు — ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధంపై సామాజిక మాధ్యమాలలో విస్తృత చర్చ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment