---Advertisement---

‘కేరళం’కి గ్రీన్ సిగ్నల్… ‘బొంగో’కి ఎందుకు రెడ్ సిగ్నల్?కేంద్రంపై మమతా బెనర్జీ విమర్శలు

February 25, 2026

Summarize with AI

---Advertisement---

కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి (Kerala State) అధికారికంగా “కేరళం” (Keralam) అనే పేరు మార్చేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో, మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి “బంగ్లా” లేదా “బొంగో” (Bongo)గా పేరు మార్చాలని అసెంబ్లీ తీర్మానాలు చేసినా కేంద్రం ఆమోదించలేదని ఆమె ప్రశ్నించారు.

రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలను పట్టించుకోలేదని, కానీ ఇతర రాష్ట్రాల విషయానికి మాత్రం త్వరగా స్పందించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ఏ రాష్ట్రంపైనా వ్యతిరేకత లేదని, అయితే రాజకీయ కారణాల వల్లే ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ (BJP) మరియు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (Marxist) మధ్య అవగాహనల కారణంగానే ఈ నిర్ణయం జరిగిందని కూడా ఆరోపించారు.

ఇక 2023లో పినరయి విజయన్ ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించగా, తాజాగా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేరళం పేరు అమల్లోకి వచ్చింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment