---Advertisement---

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

March 12, 2026

---Advertisement---

తెలంగాణలో (Telangana) ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పదిమంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణల కేసును సుప్రీంకోర్టు (Supreme Court of India) ముగిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ వ్యవహారంలో ఇటీవల అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని అత్యున్నత న్యాయస్థానం కేసును డిస్పోజ్ చేసింది.

స్పీకర్ తీర్పుతో కేసుకు తెర

పదిమంది ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన అనంతరం స్పీకర్ ఇప్పటికే తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ పూర్తి చేసి నిర్ణయం ప్రకటించామని స్పీకర్ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. దీంతో స్పీకర్ తీర్పు వెలువడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును ముగించింది.

అంతేకాకుండా తీర్పు ప్రతులను రేపటిలోగా పిటిషనర్లకు పంపించాలని, అలాగే ఐదు రోజుల్లో ఇతర సంబంధిత పత్రాలను కూడా అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసును ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది.

ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad) కీలక నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరి (Kadiyam Srihari) పార్టీ మారినట్లు నిరూపించే సరైన ఆధారాలు లేవని స్పష్టంచేశారు. దీంతో వారిపై దాఖలైన పిటిషన్లను ఆయన కొట్టివేశారు.

దీంతో ఇప్పటివరకు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్టైంది. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. సుప్రీంకోర్టు విధించిన గడువు నేపథ్యంలో స్పీకర్ తుది నిర్ణయం వెల్లడించడంతో ఈ వివాదానికి చివరికి ముగింపు లభించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment