టెలికాం వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చ మొదలైంది. రాజ్యసభ (Rajya Sabha) సభ్యుడు (Raghav Chadha) రోజువారీ డేటా పరిమితుల విషయంలో వినియోగదారులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని (Government) ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఒకటి పాయింట్ ఐదు జీబీ, రెండు జీబీ, మూడు జీబీ వంటి రోజువారీ డేటా ప్లాన్లలో వినియోగదారులు మొత్తం డేటాను ఉపయోగించకపోతే మిగిలిన డేటా అర్ధరాత్రి తర్వాత రద్దు అవుతున్న విషయం ఆయన ఎత్తిచూపారు.
డేటా రోల్ ఓవర్ విధానం అవసరమని సూచన
చద్దా (Chadha) అభిప్రాయం ప్రకారం వినియోగదారులు డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన డేటా(Data) వృథా కావడం సరికాదన్నారు. అందుకే డేటా రోల్ ఓవర్ (Data Rollover Policy) విధానం తీసుకురావాలని ఆయన సూచించారు. అంటే ఒక రోజు మిగిలిన డేటాను తదుపరి రోజుకు మార్చే అవకాశం కల్పించాలన్నదే ఆయన ప్రధాన డిమాండ్.
అదే విధంగా వినియోగదారులు తరచూ తక్కువ డేటా వాడితే, మిగిలిన డేటా విలువను తదుపరి రీచార్జ్లో తగ్గింపుగా ఇవ్వాలని కూడా సూచించారు. అంతేకాకుండా వాడని డేటాను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు పంపుకునే సౌకర్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
డేటాను డిజిటల్ ఆస్తిగా (Digital Asset) పరిగణించాల్సిన అవసరం ఉందని చద్దా పేర్కొన్నారు. టెలికాం రంగంలో (Telecom Sector) డేటా(Data) కీలక వనరుగా మారిన నేపథ్యంలో వినియోగదారులు చెల్లించిన డేటాను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.






