దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) సిద్ధమవుతోంది. లోక్‌సభతో (Lok Sabha) పాటు రాష్ట్ర అసెంబ్లీ (Assembly) స్థానాలను భారీగా పెంచేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బిల్లును త్వరలో పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం కొత్త నేతలు, మహిళలకు పెద్ద అవకాశంగా మారనుంది.
50 శాతం సీట్ల పెంపు.. ప్రాంతీయ వివాదాలకు చెక్
జనాభా ఆధారంగా డెలిమిటేషన్ (Delimitation) చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు (Southern States) అన్యాయం జరుగుతుందన్న వాదనల నేపథ్యంలో, ఈసారి నేరుగా 50 శాతం సీట్లను పెంచే విధానాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా సమానంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 816కు, 4123 అసెంబ్లీ స్థానాలు 6185కు పెరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కు, లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కు పెరగనున్నాయి. మహిళలకు (Women) కూడా పెద్దపీట వేస్తూ 87 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది.
తెలంగాణలో (Telangana) అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కు, లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కు పెరిగే అవకాశం ఉంది. మహిళలకు 60 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలు దక్కనున్నాయి.
ఈ మార్పులను 2029 ఎన్నికల (Elections 2029) నాటికి అమలు చేయాలని కేంద్ర హోం మంత్రి (Amit Shah) నేతృత్వంలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాజ్యాంగ సవరణ అవసరం ఉండటంతో విపక్షాల మద్దతు కూడా కీలకంగా మారనుంది.






