---Advertisement---

ఐపీఎల్ జట్ల వెనుక ఉన్న ఫ్రాంచైజీ యజమానుల పూర్తి వివరాలు తెలుసా?

March 25, 2026

Summarize with AI

---Advertisement---

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందింది. ఈ లీగ్‌లో ప్రతి జట్టుకు ఉన్న క్రేజ్ ఎంత ఎక్కువో, వాటి వెనుక ఉన్న యజమాన్యాలు కూడా అంతే శక్తివంతంగా ఉంటాయి. కార్పొరేట్ దిగ్గజాలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కలిసి ఈ జట్లను ముందుకు నడిపిస్తున్నారు.

ఏ జట్టు ఎవరి చేతుల్లో ఉందో తెలుసా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ప్రముఖ సంస్థలైన ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్ స్టోన్ వంటి సంస్థల చేతుల్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్(RR) జట్టును టెక్నాలజీ రంగానికి చెందిన వ్యాపారవేత్తల కన్సార్షియం నిర్వహిస్తోంది.

ముంబై ఇండియన్స్ (MI)  జట్టు నీతా అంబానీ (Nita Ambani)  ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతుల్లో ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), జూహీ చావ్లా (Juhi Chawla) మరియు వారి ఎంటర్టైన్మెంట్ సంస్థ యజమాన్యం వహిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టును కలానిథి మారన్ (Kalanithi Maran) నేతృత్వంలోని సన్ టీవీ నెట్‌వర్క్ నిర్వహిస్తోంది.

పంజాబ్ కింగ్స్ జట్టుకు (PBKS) ప్రీతి జింటా (Preity Zinta), వాడియా గ్రూప్, మొహిత్ బర్మన్ (Mohit Burman) భాగస్వామ్యంగా ఉన్నారు. డిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆధ్వర్యంలో కొనసాగుతుండగా, లక్నో సూపర్ జెయింట్స్ (LSG)  జట్టు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధీనంలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK జట్టును ఇండియా సిమెంట్స్ నిర్వహిస్తుండగా, గుజరాత్ టైటాన్స్(GT) జట్టు సీవిసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ చేతుల్లో ఉంది. ఈ బలమైన యాజమాన్యాల కారణంగానే ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌గా నిలుస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment