---Advertisement---

15 రోజులు బెంగాల్‌లోనే ఉంటా.. మమత ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పిస్తాం: అమిత్ షా సవాల్

April 2, 2026

Summarize with AI

---Advertisement---

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) బెంగాల్ రాజకీయాల్లో (West Bengal Politics) హీట్ పెంచారు. రాబోయే 15 రోజుల పాటు బెంగాల్‌లోనే ఉండి మమత సర్కార్‌ను (Mamata Government) గద్దె దించుతామని ఆయన సవాల్ విసిరారు. సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నందిగ్రామ్ నుంచే మార్పు ప్రారంభమవుతుందా?

సువేందు అధికారి (Suvendu Adhikari) నామినేషన్ కోసం ప్రత్యేకంగా బెంగాల్‌కు వచ్చానని అమిత్ షా తెలిపారు. ఆయన విజయం రాష్ట్రంలో మార్పుకు నాంది అవుతుందని చెప్పారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో (Nandigram) ఎదురైన పరిస్థితులు ఈసారి మారుతాయని, మమతా బెనర్జీ భవానీపూర్‌తో (Bhabanipur) పాటు మొత్తం బెంగాల్‌లోనే ఓటమి చవిచూడాల్సి వస్తుందని అంచనా వేశారు.

బెంగాల్‌లో పర్యటించిన ప్రతి ప్రాంతంలో ప్రజల నుంచి ఒకే స్వరం వినిపించిందని ఆయన పేర్కొన్నారు. మమతా బెనర్జీకి (Mamata Banerjee) వీడ్కోలు పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. దోపిడీ, గూండాయిజం వల్ల ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు.

రాష్ట్రంలో తరచూ జరుగుతున్న బాంబు పేలుళ్లు, పెరుగుతున్న నిరుద్యోగం యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. టీఎంసీ ప్రభుత్వం (TMC Government) చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందని, దీనివల్ల రాష్ట్ర జనాభా స్వరూపం మారుతోందని ఆరోపించారు.

బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని తగ్గించి అభివృద్ధికి దారితీస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. బెంగాల్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment