తెలంగాణలో (Telangana) గిరిజనుల (Tribal Communities) అభివృద్ధి (Development), సంక్షేమం (Welfare) పూర్తిగా బీఆర్ఎస్ పాలనలోనే (BRSGovernance) సాధ్యమైందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలిపారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో బావోజీ మహారాజ్‌ను (Bavoji Maharaj) దర్శించిన అనంతరం గిరిజనులతో మాట్లాడిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తీవ్ర విమర్శలు చేశారు. గిరిజనులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటిని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు.
3100 తండాలు గ్రామ పంచాయతీలు.. రిజర్వేషన్లు 10 శాతానికి పెంపు
దశాబ్దాలుగా గిరిజనులు కోరుకున్న “మా తండాలో మా రాజ్యం” లక్ష్యాన్ని నిజం చేసింది కేసీఆర్(KCR) నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీష్ రావు పేర్కొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన 3100 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా (Village Panchayats) మార్చిన ఘనత బీఆర్ఎస్‌కే చెందుతుందని చెప్పారు.
విద్య, ఉద్యోగాల్లో గిరిజన రిజర్వేషన్లను (Tribal Reservations) 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం వల్ల వేలాది మంది గిరిజన యువత ఉన్నత స్థానాల్లోకి చేరుకున్నారని వివరించారు. పోడు భూముల విషయంలో కూడా 6 లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు.
అదే విధంగా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ (Sant Sevalal Maharaj) జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించేలా నిధులు కేటాయించిందీ తమ ప్రభుత్వమేనని చెప్పారు. కొత్తపల్లి ప్రాంతంలో 8 కోట్లతో బ్రిడ్జి, 50 లక్షలతో బంజారా భవనం, 80 లక్షలతో దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో గిరిజనులకు సరైన ప్రాధాన్యం లేదని, లంబాడాలకు (Lambadas) కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. గిరిజనులను కేవలం ఓట్ల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు కాలేదని, గిరిజన ప్రాంతాల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని హరీష్ రావు మండిపడ్డారు.






