---Advertisement---

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆర్ కృష్ణయ్య ఫైర్.. మంత్రులు బయట తిరగలేరు అంటూ మాస్ వార్నింగ్

April 3, 2026

Summarize with AI

---Advertisement---

ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) అంశంపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య (R. Krishnaiah) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు (Bhatti Vikramarka) కలిసి ఈ వ్యవహారంలో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకోకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఫీజు బకాయిలు చెల్లించడం లేదని విమర్శించారు.

సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం తీవ్రం

ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మంత్రులు (Ministers), ఎమ్మెల్యేలు (MLAs) బయట తిరగలేరని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. అవసరమైతే రాళ్లతో (Stones) కొట్టిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులు చదువుకుంటే కూడా సహించలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.

ఈ అంశంపై ఇప్పటికే వందల సార్లు ధర్నాలు, ఆందోళనలు చేసినట్లు గుర్తు చేశారు. గతంలో సీఎం వైఎస్ఆర్ (Y. S. Rajasekhara Reddy) పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

ఇప్పటికీ ₹4,000–₹5,000 కోట్ల వరకు ఉన్న బకాయిలను కేవలం ₹12 కోట్లుగా చూపిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కూడా ఈ అంశంపై ప్రతిపక్షాలు సరైన పోరాటం చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment