స్టార్ హీరోయిన్ తమన్నాకు (Tamannaah) మద్రాస్ హైకోర్టులో (Madras High Court) చుక్కెదురైంది. ప్రముఖ సబ్బుల తయారీ సంస్థ పవర్ సోప్స్ లిమిటెడ్‌పై (Power Soaps Limited) ఆమె దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను (Appeal Petition) న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌కు కూడా కోర్టు నిరాకరించింది.
పవర్ సోప్స్ సంస్థ ఉత్పత్తులకు ప్రచారం (Promotion) కల్పించేందుకు తమన్నా 7 అక్టోబర్ 2008న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం గడువు 6 అక్టోబర్ 2009తో ముగిసింది. అయితే గడువు పూర్తయ్యాక కూడా నవంబర్ 2010, ఫిబ్రవరి 2011లో తయారైన సబ్బుల కవర్లపై తన ఫోటోలను అనుమతి లేకుండా వాడారని తమన్నా ఆరోపించింది.
ఈ విషయంపై 2011 జనవరి, ఫిబ్రవరి నెలల్లో సంస్థకు, వారి ప్రకటన సంస్థకు నోటీసులు పంపించినా సరైన సమాధానం రాలేదని తెలిపింది. దీంతో తన ఫోటోలను అనధికారికంగా వాడుకున్నందుకు రూ.1 కోటి నష్టపరిహారం (Compensation) ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది.
సాక్ష్యాలు లేవని కోర్టు స్పష్టం
ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి బెంచ్ (Single Judge) గతంలోనే తమన్నా ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ తమన్నా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
తాజాగా ఈ అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ తమన్నా వేసిన అప్పీల్‌ను శాశ్వతంగా కొట్టివేసింది. దీంతో తమన్నాకు కోర్టులో నిరాశ ఎదురైంది.






