---Advertisement---

కర్ణాటకలో సంచలన తీర్పు.. ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి యావజ్జీవ శిక్ష

April 18, 2026

---Advertisement---

కర్ణాటక రాజకీయాల్లో (Karnataka Politics) కలకలం రేపిన యోగేష్ గౌడ (Yogesh Gowda) హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. 2016 జూన్ 15న ధారవాడ జిల్లా పంచాయతీ సభ్యుడు, బీజేపీ(BJP) నాయకుడు యోగేష్ గౌడ హత్యకు గురైన కేసులో కోర్టు తుది నిర్ణయం ప్రకటించింది.

ఈ కేసులో సుదీర్ఘ దర్యాప్తు నిర్వహించిన కేంద్ర దర్యాప్తు సంస్థ మొత్తం 21 మందిని నిందితులుగా చేర్చింది. దాదాపు 10 వేల పేజీల అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించింది. విచారణ అనంతరం 3 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు, 17 మందిని దోషులుగా తేల్చింది.

దోషుల జాబితాలో ధారవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) వినయ్ కులకర్ణి (Vinay Kulkarni) ప్రధాన నిందితుడిగా నిలిచారు. ఆయనతో పాటు మరో 15 మందికి యావజ్జీవ కారాగార శిక్ష (Life Imprisonment) విధించారు. అలాగే ఈ కేసులో ఉన్న ఇన్‌స్పెక్టర్ చిన్నకేశవకు (Chinnakeshava) 7 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేశారు.

ఈ తీర్పుతో కర్ణాటక రాజకీయాల్లో చర్చలు మిన్నంటాయి. చట్టం ప్రకారం 2 సంవత్సరాలకు మించిన జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధులు పదవికి అనర్హులు అవుతారు. దీంతో వినయ్ కులకర్ణి ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment