ఎన్టీఆర్(NTR), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాపై (Pan India Movie) ప్రకటించిన రోజునుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమైనప్పటికీ ఇంకా సగానికి పైగా చిత్రీకరణ మిగిలి ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా విడుదలపై కొత్త చర్చ మొదలైంది.
మొదట ఈ సినిమాను 2026 జూన్ 25న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు అభిమానులకు షాక్ ఇస్తూ రిలీజ్ డేట్‌ను (Release Date) మార్చేశారు. తాజా ప్రకటన ప్రకారం ఈ సినిమాను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కించడంలో ప్రసిద్ధుడు. అలాగే నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకపోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ బర్త్‌డేకు గ్లింప్స్
మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు (NTR Birthday) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ (First Glimpse) విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పవర్‌ఫుల్ గ్లింప్స్ సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. బరువు తగ్గి, కండలు తిరిగిన శరీరంతో స్టైలిష్‌గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రశాంత్ నీల్ మార్క్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ (Anil Kapoor) కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.






