---Advertisement---

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది.. ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆవేదన

April 21, 2026

Summarize with AI

---Advertisement---

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై (Rural Economic System) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్దతు క్రమంగా తగ్గిపోతుండటంతో గ్రామీణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కీలకమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme – MGNREGS) బలహీనపరుస్తున్నారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమ వేదికగా స్పందించారు.

ఉపాధి హామీ పథకం బలోపేతం కావాలన్న జగన్

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ఉపాధి హామీ పథకం (Employment Guarantee Scheme) సమర్థంగా అమలు కావడం చాలా అవసరమని జగన్ తెలిపారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజల చేతిలో ఖర్చు చేయగలిగే ఆదాయం పెరుగుతుందని, దాంతో గ్రామీణ మార్కెట్లలో వినియోగం పెరిగి ఆర్థిక చలనం వస్తుందని వివరించారు.

ఎక్కువగా ఖర్చు చేసే వర్గాల చేతిలో డబ్బు ఉంటే గ్రామీణ వినియోగం పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.

అయితే గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వ హయాంలో ఈ పథకం పనితీరు బాగా పడిపోయిందని జగన్ విమర్శించారు. లేబర్ బడ్జెట్, పని చేసిన కుటుంబాల సంఖ్య, ఖర్చు చేసిన నిధులు వంటి అన్ని అంశాల్లో తగ్గుదల కనిపిస్తోందని ఆరోపించారు.

అదే విధంగా గత 2 సంవత్సరాల్లో జీఎస్టీ (GST), సేల్స్ ట్యాక్స్ (Sales Tax) వృద్ధి రేట్లు (Growth Rates) కూడా తగ్గాయని జగన్ పేర్కొన్నారు. ఇది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనే సంకేతమని అన్నారు. ప్రజల చేతిలో డబ్బు లేక డిమాండ్ తగ్గిపోతుందని, దాని ప్రభావం వ్యాపార రంగంపై కూడా పడుతోందని చెప్పారు.

ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం విఫలమైందని జగన్ విమర్శించారు. అవినీతి ఆరోపణలు, సంపద కూడబెట్టాలనే ఆశలతో ప్రభుత్వం దారి తప్పుతోందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment