---Advertisement---

ప్రధాని మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. దేశ రాజకీయాల్లో దుమారం

April 21, 2026

---Advertisement---

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ప్రధాని నరేంద్రమోదీని (Narendra Modi) ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చెన్నైలో (Chennai) జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఖర్గే, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు.ప్రధాని మోడీ ఒక ఉగ్రవాది (Terrorist) అని, ఆయన పార్టీ సమానత్వ సూత్రాలను నమ్మదని వ్యాఖ్యానించారు. అలాగే అన్నా డీఎంకే (AIADMK) పార్టీపై కూడా విమర్శలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని అన్నారు.

వ్యాఖ్యలపై తర్వాత స్పష్టత

తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో ఖర్గే తర్వాత వివరణ ఇచ్చారు. తాను ప్రధాని మోదీని ఉగ్రవాది అని అనలేదని, ప్రజలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు.

అలాగే అన్నా డీఎంకే అలాంటి రాజకీయ శైలితో ఎలా పొత్తు పెట్టుకుంటుందో ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఐటీ(IT), ఈడీ (ED) వంటి సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

దక్షిణాది రాష్ట్రాల హక్కులను (Southern States Rights) కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఖర్గే విమర్శించారు. ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మహిళలు మరియు పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

ఖర్గే వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment