---Advertisement---

అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు..సంవత్సరం తర్వాత నిందితుడు అరెస్ట్

April 25, 2026

Summarize with AI

---Advertisement---

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుటుంబాన్ని (Akshay Kumar Family) కలవరపరిచిన సైబర్ వేధింపుల కేసులో (Cyber Harassment Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె (Daughter) నిత్తారాకు (Nitara) ఆన్‌లైన్‌లో వేధింపులకు పాల్పడిన నిందితుడిని మహారాష్ట్ర సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత 1 సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు నిందితుడు పోలీసుల చేతికి చిక్కాడు.

చిన్నారి ధైర్యంతోనే నిందితుడు అరెస్ట్

ఈ కేసు గురించి మహారాష్ట్ర సైబర్ అదనపు పోలీసు ప్రధాన డైరెక్టర్ యశస్వి (Yashasvi) వివరాలు వెల్లడించారు. నిత్తారా ధైర్యంగా వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యమైందని తెలిపారు. పిల్లలు ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉంటే నేరగాళ్లు మరింత రెచ్చిపోతారని అధికారులు హెచ్చరించారు.

గతంలో ముంబైలో (Mumbai) జరిగిన సైబర్ అవగాహన కార్యక్రమం 2025లో అక్షయ్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన కుమార్తె ఆన్‌లైన్ గేమ్ (Online Game) ఆడుతున్న సమయంలో ఓ అపరిచితుడు సందేశాలు పంపాడని, అసభ్యకర ఫొటోలు పంపాలని వేధించాడని చెప్పారు.

అయితే నిత్తారా భయపడకుండా వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే అక్షయ్ కుమార్ సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించగా, విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లల భద్రత విషయంలో అక్షయ్ కుమార్ చూపిన చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment