---Advertisement---

విజయ్ విజయం.. పవన్‌కు కఠిన పరిక్షే !

May 4, 2026

---Advertisement---

తమిళనాడులో(Tamil Nadu) సినీ నటుడు విజయ్ (Vijay) ఒంటరిగా రాజకీయ రంగంలోకి దిగుతూ, ఇప్పటికే బలంగా ఉన్న పార్టీలను ఎదుర్కొని విజయం సాధించిన ఘటన దక్షిణ భారత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పటివరకు అవలంబించిన “పొత్తు రాజకీయాలు” ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తన పార్టీకి గ్రామ స్థాయిలో బలం తక్కువగా ఉందని, అందుకే పొత్తులు అవసరమని చెబుతూ వచ్చారు. 15 ఏళ్ల పొత్తు అనే అభిప్రాయాన్ని కూడా క్యాడర్‌కు వివరించారు. అయితే విజయ్ లాంటి సినీ నటుడు ఒంటరిగా పోటీ చేసి విజయాన్ని సాధించడంతో, జనసేన శ్రేణుల్లో సందేహాలు మొదలయ్యే అవకాశం ఉంది. “మనకు ఎందుకు సాధ్యం కాదు?” అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.

అయితే విజయ్ విజయం ఒక స్ఫూర్తి కేంద్రముగా మారి, జనసేన క్యాడర్‌లో (Jana Sena Party Cadre) ఒంటరి పోరాటంపై ఆసక్తిని పెంచే అవకాశం ఉంది. వారి అధినాయకుడిపై వత్తిడి తెచ్చే అవకాశమూ ఉంది. 2029 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ఈ భావజాలాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్నది కీలకం. క్యాడర్‌ను నమ్మకం కలిగించేందుకు ఆయనకు మరింత కన్విన్సింగ్ మాటలు చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. మొత్తంగా చూస్తే, విజయ్ విజయం పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపకపోయినా, పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment