---Advertisement---

అల్లూరి వర్ధంతి రోజునే వర్మను తొలగించడం క్షత్రియుల్లో ఆగ్రహం తెప్పించిందా?

May 7, 2026

---Advertisement---

క్షత్రియ కులంలో పుట్టి తన విప్లవ పోరాటంతో దేశానికే వన్నె తెచ్చిన అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి రోజునే క్షత్రియులకు (Kshatriyas) రాజకీయంగా దెబ్బకొట్టారని చంద్రబాబు గారిపై ఆయా సామాజిక వర్గాల్లో విస్తృత చర్చ ప్రారంభమైంది.

వివరాల్లోకి వెళితే, తెలుగుదేశం పార్టీకి(Telugu Desam Party), చంద్రబాబు (Chandrababu Naidu) గారికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న పిఠాపురం వర్మ (Pithapuram Varma) గారిని ఇంచార్జ్ పదవి (In-Charge Post) నుంచి తొలగించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొత్తులో భాగంగా తన సీటును చంద్రబాబు (Chandrababu Naidu) గారు చెప్పారని పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేయడమే కాకుండా, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారి గెలుపుకోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వర్మను చివరకు అత్యంత అవమానకర పరిస్థితుల్లో పిఠాపురం ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం ఆయా సామాజిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైందని వార్తలు వస్తున్నాయి.

నిజానికి, చంద్రబాబు గారు తన ఎమ్మెల్యే సీటును పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేసిన సందర్భంలో మాట్లాడుతూ, పిఠాపురం వర్మకు మొదటి వరుసలోనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవిస్తానని, దాంతో పాటు క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేసేలా వర్మకు ప్రమోషన్ ఇచ్చి పైస్థాయిలో నిలబెడతానని అందరి ముందు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడి మేరకు వర్మకు తీవ్ర అన్యాయం చేస్తున్నారా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

తమ ఆరాధ్యుడైన అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సమయంలోనే తమ ఆత్మగౌరవం దెబ్బతినేలా, ఇదే రోజున తమ సాటి క్షత్రియ కులస్తుడైన వర్మకు హామీ ఇచ్చిన విధంగా ఎమ్మెల్సీ పదవి, ప్రమోషన్ ఇవ్వకపోగా, ఇలా అవమానకర పరిస్థితుల్లో ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం.

వర్మ ఇంచార్జ్ పదవి తొలగింపు వ్యవహారం చివరకు తీవ్ర దుమారం రేపేలా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి రోజునే ప్రభుత్వం ఒక క్షత్రియ నాయకుడిని పదవి నుంచి తొలగించి అవమానకరంగా వ్యవహరించిందనే భావన ఆయా సామాజిక వర్గాల్లో ఆగ్రహావేశాలకు దారితీసిందని చెబుతున్నారు.

ఈ పరిణామం తెలుగుదేశం పార్టీపై క్షత్రియుల్లో వ్యతిరేక భావన పెరిగేలా చేసే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో క్షత్రియ వర్గానికి చెందిన కొంతమంది కూటమికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment