---Advertisement---

హైదరాబాద్‌లో సంచలనం..ఐఏఎస్ క్వార్టర్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్య కలకలం

May 8, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అత్యంత భద్రత కలిగిన జూబ్లీహిల్స్(Jubilee Hills) ఐఏఎస్ క్వార్టర్స్‌లో (IAS Quarters) జరిగిన దారుణ ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. రిటైర్డ్ ఐపీఎస్ (Retired IAS) అధికారి వినయ్ రంజన్ రే (Vinay Ranjan Ray) భార్య (Wife) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రాథమిక విచారణలో ఇంట్లో పనిచేసే పనిమనిషే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

వినయ్ రంజన్ రే తన భార్యతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఐఏఎస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. అయితే ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య వెనుక అసలు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించడం ప్రారంభించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు

ఈ హత్య కేసు విషయం తెలిసిన వెంటనే సీపీ సజ్జనార్‌తో (CP Sajjanar) పాటు ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.

భద్రత ఉన్న ప్రాంతంలోనే దారుణం

అత్యంత భద్రత ఉండే ఐఏఎస్ క్వార్టర్స్‌లో ఇలాంటి ఘటన జరగడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఇంట్లో పనిచేసే సిబ్బంది వివరాలను తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని అధికారులు మరోసారి హెచ్చరిస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment