---Advertisement---

పెట్రోల్, డీజిల్ ధరలపై పవన్ కళ్యాణ్ యూటర్న్?

May 16, 2026

---Advertisement---

పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) ధరల పెరుగుదలపై (Prices Increase) ప్రజల్లో ప్రభుత్వ విధానాలపై చర్చ మొదలైన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. “గ్యాస్, పెట్రోల్ వైసీపీ నేతల ఇంట్లో నుంచి వస్తాయా?.. యుద్ధ ప్రభావం (War Impact) ఉంటే ధరలు పెరగక ఏమవుతాయి” అనే తరహాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని గుర్తుచేస్తున్న రాజకీయ విశ్లేషకులు, ఇప్పుడు ధరలు పెరిగినా నిర్లక్ష్యంగా సమాధానాలు ఇవ్వడం ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తోందని అంటున్నారు. ఎన్నికల మానిఫెస్టోలో స్పష్టంగా ఇంధన ధరలపై భారం తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు “ధరలు పెరుగుతాయి” అనే ధోరణిలో మాట్లాడటం అహంకార రాజకీయాలకు నిదర్శనమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో గతాన్ని కూడా చాలామంది గుర్తు చేస్తున్నారు. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా ఒకే నెలలో 18 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినప్పుడు, బీజేపీతో(BJP) మిలాఖత్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కెంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్రంలో ఎలాంటి భాగస్వామ్యం లేకున్నా అప్పటి ప్రభుత్వం మీద నిందలు వేసిన నేతలు, ఇప్పుడు కేంద్రంతో పొత్తులో ఉన్న పరిస్థితిలో ఎందుకు అదే విధంగా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఊరట కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం వంటనూనెలు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయని, ఇప్పుడు ఇంధన ధరలు కూడా పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి చివరికి అన్ని వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో, గతంలో పవన్ కళ్యాణ్ కోరినట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) వ్యాట్(VAT) తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఎన్నికల హామీలను మరిచిపోయిన ప్రభుత్వంగా కూటమిపై ప్రజా వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment