---Advertisement---

హైదరాబాద్‌లో సినీ అవకాశాల పేరుతో దారుణం.. యువతిపై 2 రోజుల పాటు అత్యాచారం!

May 19, 2026

---Advertisement---

హైదరాబాద్‌లోని (Hyderabad) జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ యువతిపై (Young Woman) ఇద్దరు యువకులు లైంగికదాడికి (Sexual Assault) పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సినిమా షూటింగ్‌లో (Cinema Shooting) అవకాశం కల్పిస్తామని నమ్మించి యువతిని గదికి తీసుకెళ్లి 2 రోజుల పాటు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ (Jubilee Hills Metro Station) సమీపంలో నివసిస్తున్న 2 మంది అనాథ యువతులు చిన్న చిన్న సినిమా షూటింగ్‌లు, ఈవెంట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు బాధిత యువతితో పరిచయం పెంచుకుని సినిమా షూటింగ్ ఉందంటూ నమ్మించాడు. అనంతరం ఆమెను సికింద్రాబాద్‌లోని(Secunderabad) ఓ గదికి తీసుకెళ్లాడు.

అక్కడ తన స్నేహితుడితో కలిసి బాధిత యువతిపై 2 రోజుల పాటు లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం ఈ నెల 16న ర్యాపిడో బుక్ చేసి యువతిని తిరిగి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటికి వచ్చిన యువతి ఒంటిపై గాయాలు కనిపించడంతో ఆమె స్నేహితురాలు వెంటనే గాంధీ ఆస్పత్రికి (Gandhi Hospital) తీసుకెళ్లి చికిత్స చేయించింది.

చికిత్స సమయంలో వైద్యులు ప్రశ్నించగా తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని బాధితురాలు వెల్లడించింది. దీంతో బాధితురాలి స్నేహితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు గుర్తుతెలియని యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సినిమా అవకాశాల పేరుతో యువతులను మోసం చేసే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment