---Advertisement---

డైలాగులే ఎక్కువ.. యాక్షన్ జీరో?.. రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్!

May 25, 2026

---Advertisement---

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాటలకు చేతలకు అసలు పొంతన లేదని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం (Government) పేపర్ టైగర్‌లా (Paper Tiger) మారిందని, ప్రకటనలు తప్ప పనులు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రోహిణి కార్తె వచ్చినా ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement) మాత్రం ముందుకు కదలడం లేదని, ఈ ఆలస్యం చూసి నత్తలు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చిందన్నారు.

సోమవారం సిద్దిపేట (Siddipet) అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Procurement Center) సందర్శించిన హరీష్ రావు రైతులతో(Farmers) మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇది మిషన్ మోడ్ ప్రభుత్వం (Mission Mode Government) కాదు.. కమిషన్ మోడ్ ప్రభుత్వం (Commission Mode Government) అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి డైలాగులు చెప్పడం తప్ప యాక్షన్ తీసుకునే తత్వం లేదన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రతి బస్తాకు 2 కిలోల వరకూ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు రాస్తారోకోలు చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి కండ్లు కనిపించడం లేదని, చెవులు వినిపించడం లేదని విమర్శించారు. కల్లాల్లో రైతులు గుండెలవిసేలా బాధపడుతున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదన్నారు.

క్యాబినెట్ సమావేశంలో (Cabinet Meeting) రైతుల సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని హరీష్ రావు అన్నారు. వరి(Paddy), మక్కజొన్న(Maize), సన్‌ఫ్లవర్ (Sunflower) పంటల డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా (Urea) పంపిణీ నుంచి కరెంట్ సరఫరా వరకు, పంట కొనుగోళ్ల నుంచి రైతు సమస్యల పరిష్కారం వరకు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy), రోశయ్య (Rosaiah) హయాంలో కూడా రైతులు ఇంత ఇబ్బందులు పడలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, మొదట 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 70 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వ్యాఖ్యలపై కూడా హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు చేసే సామర్థ్యం లేక కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రం వడ్లు కొనమంటే అప్పటి సీఎం కేసీఆర్(KCR) ఢిల్లీలో ధర్నా చేసి ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తు చేశారు.

ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ (Oil Palm Factory) ప్రారంభోత్సవంలో 45 రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ 63 రోజులు గడిచినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని విమర్శించారు. ఢిల్లీ ట్రిప్పులు తగ్గించి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment