---Advertisement---

హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: KTR

May 25, 2026

---Advertisement---

కూకట్‌పల్లి నియోజకవర్గంలో (Kukatpally Constituency) ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో(KTR) పాటు ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్(Vivek Goud), నవీన్ రావు(Naveen Rao), శంభీపూర్ రాజు (Shambipur Raju) తదితరులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై విస్తృత చర్చ జరిగింది.

సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత హైదరాబాద్ భవిష్యత్‌పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు. అయితే కేసీఆర్(KCR) 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని, పేద ప్రజలు సురక్షితంగా జీవించారని తెలిపారు. ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా పాలన సాగిందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు న్యాయం చేయడానికి జీఓ 58, 59 ద్వారా పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ అన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం “ఇందిరమ్మ రాజ్యం”(Indiramma Rajyam), “ప్రజా పాలన” (Praja Palana) పేరుతో హైడ్రా (HYDRA) ద్వారా పేదల ఇళ్లను కూల్చివేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇళ్లు నిర్మించకపోగా వేల సంఖ్యలో పేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారని ఆరోపించారు.

పెన్షన్ల విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రూ.200 నుంచి రూ.2000కు పెంచిందని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ అన్నారు. అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు దక్కించుకుందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. 2028 ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జేబులో “కత్తెర పెట్టుకుని తిరుగుతుంటే దాన్ని జేబుదొంగ అనుకోవద్దు.. ఆయన గజదొంగ” అంటూ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు హైదరాబాద్‌లో (Hyderabad) ఒక్క ఇందిరమ్మ ఇల్లు (Indiramma House) కట్టినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

హైదరాబాద్ నగరంలో (Hyderabad City) 4 భారీ 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని, హైదరాబాద్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

గత 2న్నరేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని ఆరోపించిన కేటీఆర్, గృహ నిర్మాణ కార్మికులకు అండగా నిలిచేది బీఆర్‌ఎస్ పార్టీయేనని అన్నారు. జూన్ నెల నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment