---Advertisement---

కాలుష్య అంశంపై పవన్ యూటర్న్? అప్పట్లో పరిశ్రమల ప్రాధాన్యం – ఇప్పుడు పర్యావరణ ఆందోళన?

May 27, 2026

Summarize with AI

---Advertisement---

రాష్ట్ర రాజకీయాల్లో కాలుష్య సమస్య (Pollution Issue) మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం అని పౌరహక్కుల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న జనసేన (Jana Sena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యవహార శైలిపై కూడా ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి.

తాజాగా గోదావరి నదిలో పారిశ్రామిక కాలుష్యంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల కారణంగా గోదావరి కలుషితమవుతోందని, కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడం ఎలా సాధ్యమైందని అధికారులను ప్రశ్నించారు. కొన్ని పరిశ్రమలు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయని కూడా వ్యాఖ్యానించారు.

అయితే ఇదే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వంపై భిన్న స్వరంతో విమర్శలు చేశారు. అమర రాజా బ్యాటరీస్ (Amara Raja Batteries) పరిశ్రమలు పర్యావరణ అనుమతుల నిబంధనలు ఉల్లంఘించాయని గుర్తించి జగన్ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పుడు, పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేయాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అమర రాజా పరిశ్రమల కాలుష్య అంశంపై హైకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్ మాత్రం అప్పట్లో జగన్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గోదావరి కాలుష్యంపై (Godavari Pollution Issue) మాట్లాడుతూ ఆంధ్ర పేపర్ మిల్స్ సహా కొన్ని పరిశ్రమలు కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. “ఏదైనా చర్యలు తీసుకుంటే మేము రాష్ట్రం వదిలి వెళ్తాం అని పరిశ్రమలు బెదిరించడం సరికాదు” అంటూ ఆయన హెచ్చరించారు.

దీంతో ప్రతిపక్ష వర్గాలు పవన్ కళ్యాణ్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జగన్ పాలనలో కాలుష్యంపై నోటీసులు ఇస్తే అది పరిశ్రమలపై దాడిగా కనిపించిందా? ఇప్పుడు అదే చర్యలు తీసుకుంటే పర్యావరణ పరిరక్షణగా ఎలా మారిందని ప్రశ్నిస్తున్నాయి. “అప్పటి వ్యాఖ్యలు, ఇప్పటి చర్యలు చూస్తే పవన్ కళ్యాణ్ రెండు రకాల ప్రమాణాలు పాటిస్తున్నారా?” అంటూ రాజకీయ విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment