మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) – దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’(Peddi) ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో చోటుచేసుకున్న ఓ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పుడూ క్లాస్‌గా కనిపించే మెగా కోడలు ఉపాసన కొణిదెల(Upasana Konidela).. ఈసారి మాత్రం థియేటర్లో పూర్తి మాస్ అవతారంలో సందడి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఉపాసన తన తండ్రితో (Father) కలిసి ‘పెద్ది’ స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. స్క్రీన్‌పై రామ్ చరణ్ మాస్ లుక్‌తో (Mass Look) టైటిల్ రోల్లో ఎంట్రీ (Entry) ఇవ్వగానే.. ఉపాసన ఫ్యాన్స్‌తో కలిసి ఈలలు వేస్తూ థియేటర్ మొత్తం హోరెత్తించారు. అంతేకాదు చేతుల్లో ఉన్న పేపర్లను (Papers) గాల్లోకి విసిరి ఫుల్ జోష్‌లో కనిపించారు. భర్త స్క్రీన్ ప్రెజెన్స్‌ను చూసి ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం మెగా అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shivaraj Kumar), జగపతి బాబు(Jagapathi Babu), దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(A.R. Rahman) అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా మారి సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఎంటర్టైనర్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డులు సృష్టిస్తోంది. 2026 జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ బోర్డులతో ట్రెండ్ సెట్ చేస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా థియేటర్లో ఉపాసన చూపించిన మాస్ జోష్ చూసిన తర్వాత.. చరణ్ ఎంట్రీ సమయంలో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని, ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.






