---Advertisement---

జనసేన తొలి రాజ్యసభ సీటు లింగమనేని రమేశ్ కు ఖరారు?

June 5, 2026

Summarize with AI

---Advertisement---

జనసేన పార్టీకి (Jana Sena Party) కేటాయించిన తొలి రాజ్యసభ (Rajya Sabha) స్థానానికి పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రం నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు తెలుగుదేశం పార్టీకి(TDP), ఒకటి జనసేనకు కేటాయించాలని ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య నిర్ణయం జరిగిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మధ్య జరిగిన అవగాహన ప్రకారం జనసేనకు 2024-29 కాలంలో మూడు రాజ్యసభ స్థానాలు ఇవ్వాలని నిర్ణయించారని, అందులో తొలి అవకాశం ఇప్పుడు దక్కినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే ఈ స్థానాన్ని జనసేన కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు కాకుండా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి (Nara Chandrababu Naidu) అత్యంత సన్నిహితుడిగా భావించబడుతున్న లింగమనేని రమేశ్‌కు కేటాయిస్తున్నారనే వార్తలు పార్టీ వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై (Krishna River Embankment) ఉన్న లింగమనేని రమేశ్‌కు చెందిన భవనాన్ని గత కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు తన అధికారిక నివాసంగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఆ భవనం నిర్మాణంపై గతంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో లింగమనేని రమేశ్, చంద్రబాబు మధ్య ఉన్న సాన్నిహిత్యంపై రాజకీయ ప్రత్యర్థులు తరచూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.

అదేవిధంగా అమరావతి (Amaravati) ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ (Inner Ring Road Alignment) వ్యవహారంలోనూ లింగమనేని రమేశ్ పేరు ప్రస్తావనకు రావడంతో పాటు పలు ఆరోపణలు, న్యాయపరమైన వివాదాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

మరోవైపు లింగమనేని రమేశ్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సంబంధాలపై కూడా గతంలో రాజకీయ విమర్శలు వినిపించాయి. మంగళగిరి సమీపంలోని కాజా ప్రాంతంలో భూముల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలు కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇలాంటి వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో లింగమనేని రమేశ్‌కు జనసేన తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వం కేటాయిస్తే, అది రాజకీయంగా మరింత చర్చకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో జనసేన శ్రేణులు ఈ నిర్ణయాన్ని ఎలా స్వీకరిస్తాయన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment