---Advertisement---

కేసినేని చిన్నిపై నాని సంచలన ఆరోపణలు, కూటమికి కొత్త తలనొప్పా?

June 5, 2026

Summarize with AI

---Advertisement---

విజయవాడ రాజకీయాలు (Vijayawada Politics) మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మాజీ ఎంపీ కేసినేని నాని (Kesineni Nani) వరుసగా మూడు రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. “చిన్ని చీకటి సామ్రాజ్యం భయం నీడలో బెజవాడ” అనే శీర్షికతో నాని చేసిన తాజా పోస్టు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

తన పోస్టులో నాని, విజయవాడ పార్లమెంట్ పరిధిలో అధికార దుర్వినియోగం, అక్రమ వసూళ్లు, ఇసుక(Sand) మరియు మట్టి మాఫియా(Soil Mafia), రేషన్ బియ్యం స్మగ్లింగ్(Ration Rice Smuggling), ప్రైవేట్ సెటిల్‌మెంట్లు(Private Settlements), టాస్క్‌ఫోర్స్ పోలీసుల దుర్వినియోగం వంటి అనేక అంశాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఆఛా)(Andhra Pradesh Cricket Association – APCA)లో నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.

వాణిజ్య సముదాయాల వ్యవహారాల్లో రాజకీయ ప్రభావం ఉపయోగించి ఒత్తిళ్లు తెస్తున్నారని, ఆస్తి వివాదాల్లో ప్రత్యేక పోలీసు విభాగాలను వినియోగిస్తున్నారనే ఆరోపణలు కూడా తన పోస్టులో ప్రస్తావించారు. సొంత పార్టీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయించడం, వారిని జైలుకు పంపించడం వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలుగా అభివర్ణించారు.

అలాగే హైదరాబాద్ (Hyderabad) ప్రగతి నగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ ప్రయత్నాలు, విద్యాసంస్థల భూములపై వివాదాలు, ఫ్లై యాష్ దందా, పేకాట క్లబ్‌లు వంటి అంశాలపై కూడా విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయవాడ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని నాని తన పోస్టులో పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి సొంత పార్టీ నాయకుల నుంచే కేసినేని చిన్నిపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivasa Rao) కూడా చిన్నిపై అవినీతి ఆరోపణలు చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాని చేసిన ఆరోపణలు విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా కొత్త తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment