---Advertisement---

మహిళపై లైంగిక ఆరోపణ.. పీఎస్‌లో లొంగిపోయిన మాజీ సీఐ చిన్నమల్లయ్య

June 6, 2026

Summarize with AI

---Advertisement---

ఏపీలో (Andhra Pradesh) సంచలనం సృష్టించిన వినుకొండ మాజీ సీఐ చిన్నమల్లయ్య (CI Chinnamallayya) వ్యవహారం కీలక దశకు చేరుకుంది. లైంగిక ఆరోపణల కేసులో (Sexual Allegations Case) నెలరోజులకుపైగా అజ్ఞాతంలో ఉన్న చిన్నమల్లయ్య.. ఎట్టకేలకు ఈ రోజు వేకువ జామున పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి(Dhanalakshmi) అనే మహిళ(Woman).. చిన్నమల్లయ్య తనపై అత్యాచారం (Rape) చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కుటుంబం నిర్వహిస్తున్న నాటు కోళ్ల ఫారం వ్యవహారంలో పరిచయం ఏర్పడిన తర్వాత చిన్నమల్లయ్య తనను బెదిరించి లైంగికంగా వేధించాడని, అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేగింది.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయగా.. వెంటనే పోలీస్‌ శాఖ స్పందించింది. చిన్నమల్లయ్యను విధుల నుంచి సస్పెండ్‌ (Suspended) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే కేసు నమోదైన తర్వాత చిన్నమల్లయ్య కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదే సమయంలో ముందస్తు బెయిల్‌ (Anticipatory Bail) కోసం చిన్నమల్లయ్య న్యాయస్థానాలను ఆశ్రయించారు. మొదట హైకోర్టులో(High Court), అనంతరం సుప్రీంకోర్టులో (Supreme Court) ముందస్తు బెయిల్‌ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కోర్టుల నుంచి ఎలాంటి ఊరట లభించకపోవడంతో ఆయనపై ఒత్తిడి మరింత పెరిగింది.

మరోవైపు ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం, పోలీస్‌ శాఖ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేసును కావాలనే నెమ్మదిగా తీసుకెళ్తున్నారంటూ ఆరోపణలు వినిపించాయి. దీంతో డ్యామేజ్‌ కంట్రోల్‌లో భాగంగా చిన్నమల్లయ్యను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ పోలీస్‌ శాఖ తదుపరి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఒకవైపు పోలీసుల గాలింపు చర్యలు, మరోవైపు కోర్టుల్లో ఎదురుదెబ్బలు, ఉద్యోగం కోల్పోయిన పరిణామాల మధ్య చివరకు చిన్నమల్లయ్య బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన వినుకొండ (Vinukonda) పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయినట్లు తెలుస్తోంది. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment