మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara). విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పవన్ సాదినేని (Pawan Sadineni) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. తాజాగా చిత్రబృందం విడుదల తేదీని (Release Date) అధికారికంగా ప్రకటించింది.
‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నవంబర్ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ‘ది జర్నీ టు ది స్టార్స్ బిగిన్స్’(The Journey to the Stars Begins) అంటూ చిత్రబృందం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల తేదీని ప్రకటించింది. ప్రేక్షకులను సరికొత్త, అందమైన ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
దుల్కర్ సల్మాన్ నటన, పవన్ సాదినేని దర్శకత్వం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈ చిత్రంలో శ్రుతిహాసన్ (Shruti Haasan) కీలక పాత్రలో నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, శ్రుతిహాసన్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
గీతా ఆర్ట్స్(Geetha Arts), స్వప్న సినిమా(Swapna Cinema), లైట్‌బాక్స్(Lightbox) బ్యానర్లపై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాశ్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. సత్యవీరవల్లి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, సుజిత్ సారంగ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
ప్రముఖ నిర్మాణ సంస్థలు, ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికలో రూపొందుతున్న ‘ఆకాశంలో ఒక తార’పై విడుదలకు ముందే అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘మీతో కలిసి ప్రయాణించండి.. మీ కోసం ఓ అందమైన ప్రపంచం ఎదురుచూస్తోంది’ అంటూ చిత్రబృందం ప్రేక్షకులను ఆహ్వానించింది. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.






