సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో (Central African Republic) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ప్రాంతంలోని అబ్బా (Abba) ప్రాంతంలో ఓ బంగారు గని (Gold Mine) ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. పలువురు శిథిలాల కింద (Under the Debris) చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అబ్బా ప్రాంతంలోని చిన్న తరహా బంగారు గని అకస్మాత్తుగా కూలిపోవడంతో భారీగా మట్టి(Soil), బురద(Mud), రాళ్లు (Rocks) గని లోపలికి చేరుకున్నాయి. తొలుత ఈ ఘటనలో 30 మంది మృతి చెందినట్లు సమాచారం అందింది. అనంతరం సహాయక చర్యలు (Rescue Operations) కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య 100కు పైగా పెరిగింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, సహాయక సిబ్బంది (Rescue Personnel) రంగంలోకి దిగారు. గని నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే సహాయక చర్యలకు అవసరమైన భారీ యంత్రపరికరాలు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు, సిబ్బంది చేతులతోనే మట్టి, బురద, శిథిలాలను తొలగిస్తున్నారు.
గని లోపల ఇంకా పలువురు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గనిలోకి వెళ్లడం అత్యంత ప్రమాదకరంగా మారడంతో సహాయక చర్యలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సకాలంలో గుర్తించి బయటకు తీసుకురావడం సహాయక బృందాలకు పెద్ద సవాలుగా మారింది.
More than 100 people have been killed after an artisanal gold mine collapsed in western Central African Republic near the Cameroon border. Several others remain missing or trapped beneath the rubble as rescue efforts continue, while authorities have opened a judicial inquiry into… pic.twitter.com/a9WlQF0dQq
— Salar News (@EnglishSalar) August 20, 2026
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో చిన్న తరహా బంగారు గనుల తవ్వకం అనేక మంది స్థానికులకు జీవనోపాధిగా ఉంది. అయితే ఈ గనుల్లో పెద్ద సంస్థలకు ఉండే స్థాయిలో భద్రతా ఏర్పాట్లు ఉండవు. కార్మికులు సాధారణ పనిముట్లతోనే తవ్వకాలు చేపడుతుండటంతో ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
సొరంగాలకు సరైన పటిష్టత లేకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల మట్టి, రాళ్లు ఒక్కసారిగా కూలిపోయే అవకాశం ఉంటుంది. తాజా ఘటనతో చిన్న తరహా గనుల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.








