---Advertisement---

బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మిర్జా ఫఖ్రుల్.. 35 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక ఎన్నిక.!

August 20, 2026

Summarize with AI

---Advertisement---

బంగ్లాదేశ్‌లో (Bangladesh) 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా జరిగిన పోటీ అధ్యక్ష ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party – BNP) సీనియర్ నేత మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ (Mirza Fakhrul Islam Alamgir) విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయన దేశ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

మిర్జా ఫఖ్రుల్‌కు (Mirza Fakhrul) 255 ఓట్లు రాగా.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి కల్నల్ రిటైర్డ్ ఒలి అహ్మద్‌కు (Colonel Retired Oli Ahmed) 88 ఓట్లు లభించాయి. మొత్తం 349 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు వేసేందుకు అర్హత కలిగి ఉండగా.. 343 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాతీయ పార్లమెంట్ భవనంలో పోలింగ్ జరిగింది.

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్(Fakhrul Islam Alamgir)… ఎన్నో ఏళ్లుగా ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చోటుచేసుకున్న రాజకీయ మార్పుల్లో భాగంగానే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

రేపే కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ శుక్రవారం సాయంత్రం బంగాభవన్‌లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7.30 గంటలకు తాత్కాలిక సభాపతి కైసర్ కమాల్ (Kaiser Kamal) ఆయనతో ప్రమాణం చేయించనున్నట్లు సమాచారం.

35 ఏళ్ల తర్వాత మళ్లీ పోటీ

చివరిసారిగా 1991 అక్టోబర్ 8న బంగ్లాదేశ్‌లో పోటీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అభ్యర్థి అబ్దుర్ రహ్మాన్ బిశ్వాస్ (Abdur Rahman Biswas) 172 ఓట్లతో విజయం సాధించగా.. అవామీ లీగ్ అభ్యర్థి బద్రుల్ హైదర్ చౌదరికి 92 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి మాత్రమే బరిలో నిలవడంతో పోలింగ్ అవసరం లేకుండానే అధ్యక్షులు ఎన్నికయ్యారు.

షహాబుద్దీన్ రాజీనామాతో ఎన్నిక అనివార్యం

మాజీ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ (Mohammed Shahabuddin) జూలై 24న అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామా అనంతరం పార్లమెంట్ సభాపతి హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ (Hafiz Uddin Ahmed) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికలతో తాత్కాలిక వ్యవస్థకు ముగింపు పలకనుంది. మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ దేశ 23వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment