అల్లు అర్జున్ (Allu Arjun) వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటూనే వ్యాపార రంగంలోనూ (Business) తన పరిధిని విస్తరిస్తున్నారు. ఇప్పటికే అల్లు స్టూడియోస్(Allu Studios), అల్లు సినిమాస్ (Allu Cinemas) వంటి సంస్థలను ప్రారంభించిన ఐకాన్ స్టార్.. తాజాగా మరో కొత్త అడుగు వేశారు.
హైదరాబాద్లో(Hyderabad) అల్లు అర్జున్ కొత్త ఆఫీస్ (New Office) ప్రారంభించబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు ఆయనే అధికారికంగా స్పష్టత ఇచ్చారు. తన తాతయ్య, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) జయంతి సందర్భంగా కొత్త ఆఫీస్కు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
‘ICONZA’ పేరుతో కొత్త ఆఫీస్..
తన కొత్త ఆఫీస్కు ‘ICONZA’ అనే పేరు పెట్టినట్లు అల్లు అర్జున్ తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అల్లు రామలింగయ్య విగ్రహం ముందు దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తాతయ్య జయంతి రోజున ‘ICONZA’ను ప్రారంభించడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ఆఫీస్ మాత్రమే కాదని.. కొత్త కలకు, కొత్త ప్రయాణానికి ఆరంభమని తెలిపారు.
తన తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ‘ICONZA’పై ఆసక్తి నెలకొంది.
ICONZA
— Allu Arjun (@alluarjun) October 1, 2026
A new office. A new beginning.
On the birth anniversary of my grandfather, Allu Ramalingaiah garu.
The start of a new chapter. 🖤#ICONZA #ARG pic.twitter.com/vK9KyvVrso







