ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పాలనకు 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో (Delhi) మీడియాతో జరిగిన అనధికారిక సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో బీజేపీ(Telangana BJP) ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్‌లో (Punjab) కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తామని పేర్కొంటూ, ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి రావడమే రాబోయే రోజుల్లో తమ లక్ష్యమని వెల్లడించారు.
అయితే అమిత్ షా చేసిన ఈ ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణలో ఒంటరి పోటీపై స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో, భవిష్యత్తులో ఏపీలో(AP) కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీతో కలిసి రాజకీయంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ, జనసేన భవిష్యత్తు పొత్తులపై ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఏపీలో కూటమి కొనసాగితేనే అంతంతమాత్రం ప్రయోజనం ఉంటుందని, ఒకవేళ కూటమిలో ఉన్న బీజేపీతో విభేదాలు ఏర్పడితే తెలుగుదేశం, జనసేన పార్టీలకూ తీవ్ర నష్టమే జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో భాగమా, లేక పరిస్థితులకు అనుగుణంగా తర్వాత మారే అవకాశముందా అన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది.







హోంమంత్రి అనిత వర్సెస్ అమర్నాథ్ పోరులో టీడీపీకే ఎదురుదెబ్బ తగిలిందా?