---Advertisement---

పబ్లిక్‌ గార్డెన్స్‌లో హైటెన్షన్‌.. హరీశ్‌ రావు, కేటీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్ట్‌!

September 7, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్‌లోని(Hyderabad) పబ్లిక్‌ గార్డెన్స్‌(Public Gardens) వద్ద నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు(BRS MLAs) నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని బస్సులు, పోలీస్‌ వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు.

మొదట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావును(Harish Rao) పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీషర్ట్‌ విప్పి బనియన్‌తో పబ్లిక్‌ గార్డెన్స్‌లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా పోలీసులు(Police) అడ్డుకున్నారు. అనంతరం హరీశ్‌ రావును బలవంతంగా పోలీస్‌ ఇన్నోవా వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

హరీశ్‌ రావుతో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి(Malla Reddy), ప్రశాంత్‌ రెడ్డి(Prashanth Reddy), సంజయ్‌ రావు(Sanjay Rao) సహా పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను పలువురు పోలీసులు కలిసి ఎత్తుకుని బస్సుల్లోకి ఎక్కించినట్లు సమాచారం.

మరోవైపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేటీఆర్‌ను(KTR) పోలీస్‌ వాహనంలోకి ఎక్కించే సమయంలో ఆయన ప్రతిఘటించారు. వాహనంలోకి ఎక్కకుండా రోడ్డుపై కాలుతో అదిమి పట్టుకున్నప్పటికీ పోలీసులు ఆయనను బలవంతంగా ఇన్నోవాలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

ఇక రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని(Kaushik Reddy) కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలను పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి పోలీసులు తరలించారు.

ఈ పరిణామాలతో పబ్లిక్‌ గార్డెన్స్‌ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో రాజకీయంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment