---Advertisement---

ఇరాన్ మరో సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధి మళ్లీ మూసివేత.. ప్రపంచ చమురు మార్కెట్లలో కలకలం!

June 19, 2026

---Advertisement---

పశ్చిమాసియాలో (West Asia) మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు (Oil Transportation) అత్యంత కీలక మార్గంగా భావించే హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మళ్లీ మూసివేస్తున్నట్లు(Closure) ఇరాన్(Iran) ప్రకటించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. లెబనాన్‌లో (Lebanon) ఇజ్రాయెల్ (Israel) సైనిక దాడులు (Military Strikes) కొనసాగడం, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా (Military Strikes)) సైనిక బలగాల ఉనికిని కారణంగా చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

ఇరాన్(Iran) ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ దళాలు (Islamic Revolutionary Guard Corps – IRGC) సముద్ర రేడియో ప్రసారాల ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో పేర్కొన్న కీలక షరతులు పూర్తిగా అమలయ్యే వరకు హార్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేశాయి. దీంతో ప్రపంచ వాణిజ్య, ఇంధన రంగాల్లో ఆందోళన నెలకొంది.

అమెరికా-ఇరాన్ (United States-Iran) మధ్య శాంతి అవగాహన కుదిరిన (Peace Understanding) తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని భావించిన సమయంలో ఈ ప్రకటన వెలువడింది. అయితే లెబనాన్‌లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా (Hezbollah) మధ్య మళ్లీ తీవ్ర ఘర్షణలు ప్రారంభం కావడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. వాషింగ్టన్(Washington), టెహ్రాన్ (Tehran) మధ్య నెలకొన్న ఉద్రిక్తతల తగ్గింపు ప్రక్రియకు ఇది పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇరాన్ వెల్లడించిన వివరాల ప్రకారం 3 ప్రధాన షరతులు అమలైతేనే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని స్పష్టం చేసింది. అందులో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగడం, సముద్ర దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయడం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం ఉన్నాయి.

ఇక హార్ముజ్ జలసంధి వైపు ప్రస్తుతం ఎలాంటి వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు రావద్దని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అన్ని నౌకలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని, ఈ ఆదేశాలను ఉల్లంఘించే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టంగా ప్రకటించింది.

కొద్ది రోజుల క్రితమే అమెరికా-ఇరాన్ అవగాహన ఒప్పందం తర్వాత హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో చమురు రవాణా సాధారణ స్థితికి చేరుకుంటోందని ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇంధన సరఫరా మెరుగుపడుతుందని భావిస్తున్న సమయంలో ఇరాన్ మరోసారి తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లను (Global Markets) అప్రమత్తం చేసింది.

ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయనే సంకేతాలు కనిపించాయి. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా ఆగితేనే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు అమెరికా-ఇరాన్ ఒప్పందంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా ఉనికిని పూర్తిగా అంతం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment