సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘జైలర్ 2’పై(Jailer 2) భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ‘జైలర్’కు సీక్వెల్‌గా నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మించింది. తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా (Tiger Muthuvel Pandian) తనదైన స్టైల్, స్వాగ్తో ఆకట్టుకున్నారు.
వర్మన్‌ను అంతం చేసిన తర్వాత కూడా ముత్తువేల్ పాండియన్ ఎక్కడికీ వెళ్లలేదని, అతడిని పట్టుకోవడం అంత సులభం కాదనే డైలాగ్స్‌తో ట్రైలర్ మొదలవుతుంది. అసలు అతడెవరు? అతడి వెనుక ఇంకెవరున్నారు? అంటూ విలన్ గ్యాంగ్స్(Villain Gangs) భయపడే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్ కూడా అక్కడక్కడా కనిపించింది. రజనీకాంత్ నడక, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీకి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) నేపథ్య సంగీతం మరింత బలాన్ని ఇచ్చింది.
రజనీకాంత్ మాస్ ఎలివేషన్స్ ఆకట్టుకున్నప్పటికీ, ‘జైలర్’తో పోలిస్తే ‘జైలర్ 2’ ట్రైలర్లో అదే స్థాయి ఉత్కంఠ కనిపించలేదనే భావన కలుగుతోంది. ఫస్ట్ పార్ట్‌లోని గూస్బంప్స్ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, ఇతర భాషల స్టార్ హీరోల ప్రత్యేక పాత్రలు సినిమాపై అంచనాలను పెంచాయి. కానీ సీక్వెల్ ట్రైలర్లో ప్రతీకార కథకు డార్క్ కామెడీని జోడించినట్టుగా కనిపిస్తోంది. రజనీకాంత్ స్వాగ్ ఉన్నా.. కంటెంట్‌లో ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కొత్తదనం మాత్రం పూర్తిగా కనిపించలేదనే అభిప్రాయం కలుగుతోంది.
ట్రైలర్‌కు మించి దర్శకుడు నెల్సన్ ఎలాంటి సర్ప్రైజ్లు దాచారన్నదే ఆసక్తిగా మారింది. ఊహించని మలుపులు, ప్రత్యేక పాత్రలు, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ‘జైలర్ 2’ అంచనాలను అందుకుంటుందో చూడాలి.







